
భారతీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు వరుసగా మూడో సెషన్లో లాభాలతో ముగిశాయి. బుధవారం ఇంట్రాడేలో 75,568.38 పాయింట్ల గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ 147.79 పాయింట్లు (0.20 శాతం) పెరిగి 75,449.05 వద్ద స్థిరపడింది.
అలాగే నిఫ్టీ 73.30 పాయింట్లు (0.32 శాతం) పెరిగి 22,907.60 వద్ద ముగిసింది. బుధవారం ఈ సూచీ 22,940.70 నుంచి 22,807.95 శ్రేణిలో ట్రేడ్ అయింది.
శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, అపోలో హాస్పిటల్స్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు 3.91 శాతం వరకు లాభపడ్డాయి. నిఫ్టీ 50లో టెక్ మహీంద్రా, బ్రిటానియా, టీసీఎస్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా షేర్లు 2.32 శాతం వరకు నష్టపోయాయి.
నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు 2 శాతానికి పైగా లాభపడ్డాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, ఐటీ మినహా ఎన్ఎస్ఈలోని అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి.
Comments
Please login to add a commentAdd a comment