దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:34 సమయానికి నిఫ్టీ(Nifty) 66 పాయింట్లు నష్టపోయి 23,249కు చేరింది. సెన్సెక్స్(Sensex) 279 పాయింట్లు దిగజారి 76,761 వద్ద ట్రేడవుతోంది. దాంతో గత రెండు రోజుల లాభాలకు బ్రేక్ పడినట్లయింది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 108.98 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 81.64 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.61 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.21 శాతం నష్టపోయింది. నాస్‌డాక్ 0.89 శాతం దిగజారింది.
ఇదీ చదవండి: భారత్‌లో టాప్ 5 బ్రాండ్ లిస్ట్‌లోకి యాపిల్
రిటైల్ ద్రవ్యోల్బణం మరింత తగ్గి, 5 శాతం లోపునకు పడిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆర్‌బీఐ ద్రవ్యోల్బణం నుంచి వృద్ధి వైపు దృష్టి సారిస్తుందని నమ్ముతున్నారు. కరెన్సీ అస్థిరత కొంత అనిశ్చితిని సృష్టిస్తున్నప్పటికీ, ఆర్‌బీఐ సరళతర ఆర్థిక విధానంవైపు అడుగులు వేయవచ్చని భావిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఫిబ్రవరి పాలసీ సమీక్ష జరుగుతుంది. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్‌లోని పలు అంశాలు ప్రస్తుత ఆర్‌బీఐ పాలసీని ప్రాతిపదికగా తీసుకునే అవకాశం ఉంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment