దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం 9:16కు నిఫ్టీ 36 పాయింట్లు లాభపడి 21,747 వద్దకు చేరింది. సెన్సెక్స్ 87 పాయింట్లు పుంజుకుని 72,113 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా మార్కెట్లు రేంజ్‌బౌండ్‌లోనే ఉన్నాయి. యూరప్‌మార్కెట్లు కొంత నష్టాల్లో ట్రేడయ్యాయి. ఎఫ్‌ఐఐలు రూ.1696 కోట్లు విలువైన షేర్లు స్టాక్‌మార్కెట్‌లో కొనుగోలు చేశారు. డీఐఐలు రూ.3497 కోట్ల విలువైన షేర్లు మార్కెట్‌నుంచి విక్రయించారు. ఇటీవల వెలువడిన యూఎస్ జాబ్స్ డేటా ప్రకారం మార్కెట్ ఊహించిన 1,70,000 ఉద్యోగాలకు బదులుగా 2,16,000 ఉద్యోగాలు పెరిగాయి. లేబర్ మార్కెట్ పుంజుకుంటున్న నేపథ్యంలో ఫెడ్ కీలక వడ్డీరేట్లను తగ్గించేందుకు మరింత సమయం తీసుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
సెన్సెక్స్ 30 సూచీలో టైటాన్, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్, టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, మారుతి సుజుకీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్‌ఫిన్‌సర్వ్, భారతీ ఎయిర్‌టెల్ లాభాల్లో ట్రేడవుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐటీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్‌యూఎల్ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment