దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ 56 పాయింట్లు పెరిగి 25,068కు చేరింది. సెన్సెక్స్ 170 పాయింట్లు పుంజుకుని 81,801 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 102.5 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 77.5 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.01 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.97 శాతం లాభపడింది. నాస్‌డాక్ 1.44 శాతం పుంజుకుంది.
ఇదీ చదవండి: కిక్కెక్కిస్తోన్న ‘క్విక్ కామర్స్’!
ఈరోజు ఆర్‌బీఐ మానిటరీ పాలసీ సమావేశం వివరాలు వెల్లడి కానున్నాయి. మార్కెట్‌లు కొంత ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దానికితోడు పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఉండడంతో మదుపర్లు కొంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య పోరు లెబనాన్‌కు పాకడం.. ఇరాన్ కూడా రంగంలోకి దూకి ఇజ్రాయెల్‌పై మిసైళ్ల వర్షం కురిపించడంతో ఈ ప్రాంతంలో పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గడిచిన రెండేళ్ల కాలం నుంచి వారం రోజుల్లో మార్కెట్లు భారీగా పడిపోయాయి. అయితే, ఈ పతనాలను చూసి రిటైల్ ఇన్వెస్టర్లు మరీ అందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు మార్కెట్ నిపుణులు. గత యుద్ధాల సమయంలో పడిపోయిన మార్కెట్లు చాలా త్వరగా కోలుకున్నాయని, అందుకే ఈ మార్కెట్ క్రాష్‌ను సదవకాశంగా మలచుకోవాలని సూచిస్తున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment