శుక్రవారం ఉదయం లాభాల బాటపట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవి చూశాయి. సెన్సెక్స్ 1,820.19 పాయింట్లు లేదా 2.36 శాతం పెరిగి 78,975.98 వద్ద, నిఫ్టీ 525.70 పాయింట్లు లేదా 2.25 శాతం పెరిగి 23,875.60 వద్ద నిలిచాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), టైటాన్ కంపెనీ, టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ (TCS), జేఎస్డబ్ల్యు స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలోకి చేరాయి. బజాజ్ ఆటో, వోడాఫోన్ ఐడియా, ఫెడరల్ బ్యాంక్, పీఐ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి. నిన్న (నవంబర్ 21) భారీ నష్టాలను చవి చూసిన అదానీ సంస్థలు మళ్ళీ లాభాల్లో పయనించాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ 154 పాయింట్లు లాభపడి 23,491కు చేరింది. సెన్సెక్స్ 443 పాయింట్లు ఎగబాకి 77,596 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 107.07 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 74.4 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.42 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.5 శాతం పెరిగింది. నాస్‌డాక్ 0.03 శాతం పుంజుకుంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment