దేశీయ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన కంపెనీలు ఒక్కొక్కటిగా తమ మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. స్టాక్ ఫలితాలకు తగ్గట్టుగా మన పెట్టుబడి వ్యూహాన్ని మారుస్తుంటాం. అయితే కొన్ని రోజులుగా మార్కెట్‌ను అనుసరిస్తున్నవారు, కొత్తగా మార్కెట్‌లోకి వచ్చినవారు ఈ సమయంలో ఎలా స్పందించాలో నిపుణులు కొన్ని సలహాలు సూచనలు చేస్తున్నారు.
- మన పోర్ట్‌ఫోలియోలోని కంపెనీలు వాటి ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తుందో ట్రాక్ చేయాలి. ఇది సాధారణంగా ముందుగానే షెడ్యూల్ చేస్తారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ ఇన్వెస్టర్ రిలేషన్స్ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.
- ఫలితాల్లో కంపెనీలు తమ ఆదాయాలు, బ్యాలెన్స్ షీట్, క్యాష్‌ఫ్లో సహా దాని ఆర్థిక నివేదికలను ప్రకటిస్తాయి. స్టాక్‌కు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునేముందు వాటిని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. ఈ నివేదికల వల్ల కంపెనీ పనితీరును సమీక్షించడానికి వీలువతుంది.
- కంపెనీలు ఫలితాలు విడుదల చేయడానికి ముందే ఆర్థిక నిపుణలు, విశ్లేషకులు తరచు సంస్థ పనితీరును గమనిస్తూ రిజల్ట్స్‌ను అంచనా వేస్తారు. ఈ అంచనాలతో వాస్తవ ఫలితాలను సరిపోల్చాలి. ఒకవేళ ఫలితాలు అంచనాలను మించి ఉంటే అది సానుకూలంగా పరిగణించవచ్చు.
- గతంలో కంపెనీ పనితీరు ఎలా ఉంది.. ఫలితాలు ప్రభావితం చేసే ఏవైనా ఆర్థిక అంశాలు ఉన్నాయో అర్థం చేసుకోవాలి.
- చాలా కంపెనీలు వాటి భవిష్యత్ పనితీరుపై మార్గదర్శకత్వం లేదా ఔట్‌లుక్‌ను విడుదల చేస్తాయి. సానుకూలంగా నివేదికలు అందించే కంపెనీల్లో స్టాక్ పెరుగుదల చూడవచ్చు.
- ఫలితాల వల్ల మార్కెట్ ఎలా స్పందిస్తుందో గమనించాలి. ఒక్కోసారి స్టాక్ ధర వేగంగా పడిపోవచ్చు..పెరగొచ్చు. స్టాక్ సంబంధించిన అన్ని అంశాలను గమనించాలి. దీర్ఘకాలిక పెట్టుబడిదారులైతే స్టాక్ ధరలో హెచ్చుతగ్గులు అంతగా పట్టించుకోవద్దు. స్వల్పకాలిక మార్కెట్ కదలికల ఆధారంగా హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోకూడదు.
ఇదీ చదవండి: ఈసారైనా సెక్షన్ 80సీకు మోక్షం లభిస్తుందా..?
- ఒకే కంపెనీలో కాకుండా పోర్ట్‌ఫోలియో డైవర్సిఫై చేయడం ఎంతో ఉపయోగపడుతుంది. ఒకవేళ ఏదైనా కంపెనీ అనుకున్న ఫలితాలు విడుదల చేయకపోయినా పోర్ట్‌ఫోలియో పెద్దగా నష్టాల్లోకి వెళ్లకుండా ఉంటుంది.
- స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల నష్టాలు, లాభాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఫలితాల ఆధారంగా స్టాక్ అమ్మాలో, కొనాలో అనే నిర్ణయం తీసుకోవడానికి ముందు కంపెనీ భవిష్యత్తు పనితీరును పరిగణలోకి తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment