దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 325 పాయింట్లు క్షీణించి 0.50% తగ్గి 64,933.87 వద్ద ముగిసింది. నిఫ్టీ 82 పాయింట్లు నష్టపోయి 0.42% కుంగి 19,443.50 వద్ద ముగిసింది.
అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ట్రేడయ్యాయి. యూఎస్ క్రెడిట్ రేటింగ్ ఔట్‌లుక్‌ను మూడీస్ స్టేబుల్ నుంచి నెగెటివ్‌కు మార్చింది. ఈ నేపథ్యంలో అక్కడి మార్కెట్లలో ప్రతికూల వాతావరణం నెలకొంది. ఐరోపా సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. సోమవారం ఆసియా- పసిఫిక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. దేశీయంగా ఆదివారం జరిగిన ప్రత్యేక మూరత్ ట్రేడింగ్‌లో సూచీలు లాభాల్లో ముగిశాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు శుక్రవారం రూ.261 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ మదుపర్లు రూ.822 కోట్లు విలువ చేసే స్టాక్స్‌ను కొనుగోలు చేశారు.
సెన్సెక్స్ 30లో ఎం అండ్ ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటాస్టీల్, టాటా మోటార్స్ మినహా అన్ని స్టాక్‌లు నష్టాల్లో ట్రేడయ్యాయి.
దీపావళి బలిప్రతిపద సందర్భంగా మంగళవారం(నవంబర్ 14) రోజున దేశీయ స్టాక్‌మార్కెట్లకు సెలవు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment