
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం 9:20 సమయానికి నిఫ్టీ 26 పాయింట్ల నష్టంతో 21,519 వద్దకు చేరింది. సెన్సెక్స్ 81 పాయింట్లు దిగజారి 71,304 వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌సీఎల్ టెక్, నెస్లే, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టీసీఎల్, సన్‌ఫార్మా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్ స్టాక్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎల్ అండ్ టీ, భారతీఎయిర్‌టెల్, ఎస్‌బీఐ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.
అమెరికా 10 ఏళ్ల బాండ్‌ఈల్డ్‌లు 4 శాతంకు పెరిగాయి. యూఎస్ మార్కెట్లు మంగళవారం కొంత రేంజ్‌బౌండ్‌లోనే ముగిశాయి. చమురు బ్యారెల్ 77.5 డాలర్లుగా ఉంది. మంగళవారం ఈక్విటీ మార్కెట్‌లో ఎఫ్‌ఐఐలు రూ.990 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు. డీఐఐలు రూ.104.23 కోట్ల విలువ చేసే షేర్లు కొనుగోలు చేశారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)