లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు | Stock Market Updates On March 17 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Published Mon, Mar 17 2025 4:38 PM | Last Updated on Mon, Mar 17 2025 4:42 PM

Stock Market Updates On March 17

దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 111 పాయింట్లు లాభపడి 22,508 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 341 పాయింట్లు ఎగబాకి 74,169 వద్దకు చేరింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎం అండ్‌ ఎం, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెబ్‌, జొమాటో, ఐసీఐసీఐ బ్యాంక్‌, సన్‌ ఫార్మా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ స్టాక్‌లు లాభాల్లో ముగిశాయి. ఐటీసీ, నెస్లే, ఎస్‌బీఐ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎల్‌ అండ్‌ టీ, టీసీఎస్‌, పవర్‌ గ్రిడ్‌ స్టాక్‌లు భారీగా నష్టపోయాయి.

మార్కెట్ లాభాలకు కొన్ని కారణాలు..

అమెరికా ఈక్విటీలు పుంజుకోవడం, దేశీయ వినియోగాన్ని పెంచడానికి చైనా తాజా చర్యలను ప్రకటించడం ప్రపంచ సెంటిమెంట్‌ను మెరుగుపరిచింది. ఆటో, ఫైనాన్షియల్, బ్యాంకింగ్ రంగ షేర్లలో లాభాలు ర్యాలీకి గణనీయంగా దోహదం చేశాయి. చైనా విధానపరమైన చర్యలతో నడిచే ఆసియా మార్కెట్లలో సానుకూలత నెలకొనడంతో ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాలతో ముగిసినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి: భారత్‌లో యాపిల్‌-గూగుల్‌ భాగస్వామ్యం..?

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement