స్టాక్‌మార్కెట్ అంటేనే ఒడిదొడుకులతో నిండి ఉంటుంది. దాన్ని పూర్తిగా అర్థం చేసుకోనివారు అదో గ్యాంబ్లింగ్ అనుకుంటారు. కానీ కాస్త అనుభవం ఉన్నవారు, మార్కెట్‌ను నిత్యం పరిశీలిస్తున్నవారికి అందులోని ఆంతర్యం అర్థం అవుతుంది. ఎలాంటి సందర్భాల్లో ఎలా స్పందిస్తుందో చెప్పేస్తారు. అలాఅని వారు అనుకుంది ప్రతిసారి జరగాలని మాత్రం లేదు. మార్కెట్‌లో నిత్యం నేర్చుకోవాల్సిందే. ఈరోజు మార్కెట్లో అనుకున్న స్ట్రాటజీ రేపు పనిచేయకపోవచ్చు. కాబట్టి మార్కెట్‌లో అన్నివేళలా ప్రతిస్ట్రాటజీ పనిచేస్తుందనుకోవద్దు. ఈ మధ్య మార్కెట్‌లు వరుసగా భారీగా దిద్దుబాటుకు గురవుతున్నాయి.
స్టాక్ మార్కెట్‌లో బుధవారం స్మాల్, మిడ్‌క్యాప్ సూచీల పతనం కొనసాగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఈ సూచీలు గరిష్ఠాలకు చేరాయి. తదుపరి నష్టపోతూ వస్తున్నాయి. ఇప్పటివరకు స్మాల్‌క్యాప్ సూచీ 12%, మిడ్‌క్యాప్ సూచీ 6% పతనమయ్యాయి. గత కొన్ని సెషన్లలో చిన్న, మధ్యస్థాయి కంపెనీల షేర్లు భారీగా పడిపోతున్నాయి. ఇందుకు కారణాలు కింది విధంగా ఉన్నాయి.
- సెబీ మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి స్ట్రెస్ టెస్ట్ డేటాను ఈ నెల 15న వెలువరించనుంది. దాంతో ఫండ్స్‌లోని నిధులు ఏమేరకు వచ్చాయి. ఎలా వచ్చాయి. ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు.. వంటి అనేక అంశాలను పరిగణిస్తూ రిపోర్ట్ వెలువడనుంది. అయితే ఇప్పటికే చాలామంది ఇన్వెస్టర్లు వారి పోర్ట్‌ఫోలియోలోని మ్యూచువల్‌ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్లను అమ్మేసినట్లు తెలిసింది. కానీ ఈ ర్యాలీ 15వ తేదీ వరకు కొనసాగనుందని సమాచారం.
- పొజిషన్లను కొనసాగించేందుకు ఖాతాదారుల నుంచి అదనపు మార్జిన్ సొమ్మును బ్రోకర్లు అడుగుతున్నారు. దీంతో కొంత మంది పొజిషన్లను అమ్మేస్తున్నారు.
- దుబాయ్‌కు చెందిన హవాలా ఆపరేటర్ హరిశంకర్ టిబ్రేవాలాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు చేయడం ప్రతికూల ప్రభావం చూపింది. అక్కడ నుంచి నిధులు దేశీయ స్టాక్‌మార్కెట్లలోకి అక్రమంగా చేరుతున్నాయనే ఆరోపణలున్నాయి.
- కొన్ని చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్ల ధరలు బుడగల్లా ఉన్నాయని సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురి పేర్కొనడమూ, మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
- మదుపర్ల ప్రయోజనాలు పరిరక్షించేలా అప్రమత్తంగా వ్యవహరించాలని స్మాల్, మిడ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్ పథకాలకు సెబీ గత నెలలో నియమావళి జారీ చేయడమూ ఆందోళనకు కారణమైంది.
- సాధారణంగానే ఆర్థిక సంవత్సరం చివరి నెల అయిన మార్చిలో విక్రయాలు జరుపుతుంటారు. గత 23 ఏళ్లలో సగానికి పైగా సార్లు, మార్చిలో ఈ షేర్లు ప్రతికూల ప్రతిఫలాలు ఇచ్చాయి.
- అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండిమా(ఆంఫీ) ఇటీవల పలు ఫండ్స్‌లో వస్తున్న రిటైల్ ఇన్వెస్టర్ల డబ్బులు ఆపేలా చర్యలు తీసుకుంది. దాంతో చాలా ఫండ్స్ మేనేజర్లు లమ్‌సమ్ నగదును నిలిపేశాయి.
ఇదీ చదవండి: ఒకసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ టు శ్రీకాకుళం!
ప్రస్తుతం నెలకొంటున్న మార్కెట్ ఒడిదొడుకుల్లో స్వల్పకాల పెట్టుబడుల కోసం ఇన్వెస్ట్ చేసేవారు కాస్త ఆచుతూచి వ్యవహరించాలని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాల పెట్టుబడుల కోసం ఇన్వెస్ట్ చేసేవారికి ఇదో మంచి అవకాశం అని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment