ఈ వారంలో నిఫ్టీ చరిత్రాత్మక స్థాయి 25,000 పాయింట్లను పరీక్షించొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎగువ స్థాయిలో 24,963 పాయింట్ల వద్ద నిరోధాన్ని చేధించాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఇన్వెస్టర్లు జీవితకాల గరిష్టాల వద్ద లాభాలను స్వీకరిస్తే దిగువన 24,504 – 24,600 శ్రేణిలో తక్షణ మద్దతు ఉందని చెబుతున్నారు. అమెరికా జీడీపీ గణాంకాలు, అంతర్జాతీయంగా డిమాండ్ ఊపందుకోవచ్చనే అంచనాలు, దలాల్ స్ట్రీట్‌పై సంస్థాగత ఇన్వెస్టర్ల విశ్వాసం తదితర అంశాలతో బడ్జెట్ తర్వాత నష్టాల నుంచి స్టాక్ మార్కెట్ రికవరీ అయింది. వరుస అయిదు రోజుల పతనం నుంచి గట్టెక్కిన సూచీలు శుక్రవారం జీవితకాల గరిష్టం వద్ద ముగిశాయి.
ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు: రూ.53 వేల కోట్లు
విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ఎన్‌ఎస్‌డీఎల్ డేటా ప్రకారం జులై నెలలో 26 నాటికి ఈక్విటీలో రూ.33,688 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. డెట్ మార్కెట్లోకి రూ.19,222 కోట్లు వచ్చాయి. దీంతో మొత్తం ఈ నెలలో ఇప్పటి వరకు ఎఫ్‌పీఐలు రూ.52,910 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ‘ఎఫ్‌అండ్‌ఓ ట్రేడింగ్‌పై సెక్యూరిటీ లావాదేవీల పన్ను పెంపుతో పాటు మూలధన లాభాలపై పన్ను పెంచాలనే బడ్జెట్ ప్రతిపాదనలు ఎఫ్‌పీఐలకు ప్రతికూలంగా మారింది. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు తిరిగి ఉపసంహరించుకునే అవకాశం లేకపోలేదు. అయితే ఈ ధోరణి స్వల్ప కాలికంగా మాత్రమే ఉంటుందని, రానున్న రోజుల్లో ఈక్విటీల్లోకి మరిన్ని పెట్టుబడులు వస్తాయి’ అని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
ఇదీ చదవండి: ట్రేడింగ్ చేస్తున్నారా.. జాగ్రత్త!
ఈ వారంలో వెలువడే కంపెనీల క్యూ1 ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్‌కు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. యూరోజోన్ జీడీపీ డేటా(మంగళవారం), చైనా తయారీ రంగ గణాంకాలు బ్యాంకు ఆఫ్ ఇంగ్లాడ్ ద్రవ్య విధాన నిర్ణయాలు(గురువారం), అమెరికా ఉద్యోగాల డేటా ట్రేడింగ్‌కు ప్రభావితం చేయొచ్చు. దేశీయంగా జులై నెలకు సంబంధించి గురువారం(ఆగస్టు 1న) దేశీయ ఆటో కంపెనీల అమ్మకాల డేటా, తయారీ రంగ పీఎంఐ గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. వీటితో పాటు ప్రపంచ మార్కెట్ల పనితీరు, రూపాయి విలువ, విదేశీ పెట్టుబడులను పరిగణించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment