బుధవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 50.62 పాయింట్లు లేదా 0.065 శాతం నష్టంతో 78,148.49 వద్ద, నిఫ్టీ 18.95 పాయింట్లు లేదా 0.080 శాతం నష్టంతో 23,688.95 వద్ద నిలిచాయి.
ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఐటీసీ, ఏషియన్ పెయింట్స్ వంటివి టాప్ గెయిన్ర్స్ జాబితాలో చేరాయి. అపోలో హాస్పిటల్, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్ సిమెంట్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:35 సమయానికి నిఫ్టీ(Nifty) 73 పాయింట్లు నష్టపోయి 23,628కు చేరింది. సెన్సెక్స్(Sensex) 289 పాయింట్లు దిగజారి 77,910 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 108.55 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 77 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.69 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు(stock market) గడిచిన సెషన్‌లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.1 శాతం నష్టపోయింది. నాస్‌డాక్ 1.9 శాతం దిగజారింది.
ఇదీ చదవండి: అమెజాన్ తొలి రాకెట్ ప్రయోగం.. స్పేస్‌ఎక్స్‌కు ముప్పు?
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఆర్థిక విధానాలపై అనిశ్చితులు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు నెలకొన్నాయి. యూఎస్ బాండ్లపై రాబడులు 4.69 శాతానికి చేరుకోవడంతో ఎఫ్‌ఐఐల పెట్టుబడులు తరలిపోతున్నాయి. మరోవైపు డాలర్ ర్యాలీ ఆగడం లేదు. ఈ పరిణామాలు భారత్ లాంటి వర్థమాన దేశాలకు ప్రతికూలంగా మారాయి. వీటికి తోడు భారత్‌లో హెచ్‌ఎంపీవీ కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశీయ కంపెనీల మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగా ఉండొచ్చని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు చెబుతున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment