దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ(Nifty) 46 పాయింట్లు నష్టపోయి 23,106కు చేరింది. సెన్సెక్స్(Sensex) 121 పాయింట్లు పడిపోయి 76,294 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 108.31 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 78.71 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.6 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.61 శాతం లాభపడింది. నాస్‌డాక్ 1.28 శాతం ఎగబాకింది.
‘అమెరికా ఫస్ట్’ నినాదంతోట్రంప్ మెక్సికో, కెనడాలపై ఫిబ్రవరి 1 నుంచి 25% వాణిజ్య సుంకాల విధింపునకు సిద్ధమయ్యారు. భారత్‌తో సహా ఇతర దేశాలపై సుంకాల విధింపు తప్పదని గతంలో వ్యాఖ్యానించారు. ట్రంప్ టారిఫ్ ఆందోళనలతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దేశీయ కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరుస్తున్నాయి. ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడించిన లిస్టెడ్ కంపెనీల సగటు నికరలాభ వృద్ధి కేవలం 4%గా మాత్రమే నమోదైంది. వార్షిక ప్రాతిపదిక డిసెంబర్ త్రైమాసికంలో నిఫ్టీ50 కంపెనీల ఈపీఎస్(ఎర్నింగ్స్ పర్ షేర్) 3% మాత్రమే ఉంటుందని బ్లూమ్‌బర్గ్ ఇటీవల అంచనా వేసింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment