దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 103 పాయింట్లు నష్టపోయి 22,044 వద్దకు చేరింది. సెన్సెక్స్ 454 పాయింట్లు దిగజారి 72,488 వద్దకు చేరింది.
సెన్సెక్స్ 30 సూచీలో భారతీ ఎయిర్‌టెల్, పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, టాటాస్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లు మినహా మిగతావి నష్టాల్లోకి చేరుకున్నాయి. నెస్లే, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్, ఐటీసీ, సన్‌ఫార్మా, బజాన్ ఫిన్‌సర్వ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలు భారీగా నష్టపోయిన జాబితాలో ఉన్నాయి.
యుద్ధభయాలు విస్తరించడం, వడ్డీ రేట్ల దిశపై అనిశ్చితికి తోడు ముడి చమురు ధరలు పెరుగుతుండడంతో కొంత మంది మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపినట్లు తెలిసింది. మ్యూచువల్ ఫండ్‌లలో ద్రవ్యలభ్యత అధికంగా ఉండటం వల్ల, సూచీలను కొంతవరకు ఆదుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. విదేశీ సంస్థాగత మదుపర్లు మంగళవారం నికరంగా రూ.4,468.09 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.2,040.38 కోట్ల స్టాక్స్‌ను కొన్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment