
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు మంగళవారం భారీగా పుంజుకున్నాయి. సోమవారం ట్రేడింగ్‌పూర్తయ్యే సమయానికి దాదాపు 0.9 శాతం కుంగిన సూచీలు ఇవ్వాల్టి మార్కెట్ ఓపెన్‌లో నిఫ్టీ 131 పాయింట్లు లాభపడి 21,639 వద్దకు చేరింది. సెన్సెక్స్ 414 పాయింట్లు పుంజుకుని 71,769 వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ 30 సూచీలో విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, టీసీఎస్, టాటా మోటార్స్, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టైటాన్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్లు, నెస్లే.. స్టాక్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
యూరప్, అమెరికా స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ట్రేడింగ్ ముగించాయి. నేడు ఆసియా-పసిఫిక్ సూచీలు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర మంగళవారం ఉదయం 76.41 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు సోమవారం రూ.16.03 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత పెట్టబడిదారులు రూ.155.96 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.