
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగించాయి. ఉదయం ఊగిసలాటతో మొదలైన బెంచ్ మార్క్ సూచీలు చివరికి ఫ్లాట్ ముగింపును నమోదు చేశాయి. ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలకు చెందిన షేర్లు లాభపడ్డాయి.
బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 16 పాయింట్ల నష్టపోగా.. నిఫ్టీ కేవలం 5 పాయింట్ల మేర నష్టాన్ని నమోదు చేసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 119 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 113 పాయింట్ల మేర నష్టపోయాయి. అలాగే బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.4 శాతం మేర లాభపడ్డాయి.
ఎన్‌ఎస్‌ఈలో సన్ ఫార్మా, బీపీసీఎల్, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, సిప్లా, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, బ్రిటానియా, ఎస్బీఐ లైఫ్, కోటక్ బ్యాంక్, ఎల్ టిఐఎమ్, టెక్ మహీంద్రా, టాటా కన్జూమర్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హిందాల్కొ, బజాజ్ ఫిన్ సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, హిందుస్థాన్ యూనీలివర్, బజాజ్ ఆటో, నెస్లే, ఐషర్ మోటార్స్, టైటాన్, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, గ్రాసిమ్ కంపెనీల షేర్లు లాభాలతో తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో హీరో మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, దివీస్ ల్యాబ్, రిలయన్స్, అపోలో హాస్పిటల్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, కోల్ ఇండియా, ఐటీసీ, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎల్ టి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతీ, ఎయిర్ టెల్, టీసీఎస్, యూపీఎల్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, విప్రో కంపెనీల షేర్లు నష్టాల బాటపట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment