దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 165 పాయింట్లు లాభపడి 23,735 వద్దకు చేరింది. సెన్సెక్స్ 498 పాయింట్లు పుంజుకుని 78,540 వద్దకు చేరింది.
ఇటీవల భారీగా మార్కెట్‌లు పడిపోతున్నాయి. గతవారం ట్రెండ్ ఈవారం కొనసాగే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం వరకు ఈ ఒడిదొడుకులు తప్పవని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌ల పరిణామాలు దేశీయ మార్కెట్‌లపై ప్రభావం చూపుతున్నాయి. బాండ్ ఈల్డ్‌లు భారీగా పెరుగుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ జీవితకాల గరిష్టాలను చేరుతోంది.
ఇదీ చదవండి: ఏడాదిలో రికార్డు స్థాయిలో ఐఫోన్ ఎగుమతులు
సెన్సెక్స్ 30 సూచీలో టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, ఇండ్‌స్ ఇండ్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్ స్టాక్‌లు లాభాల్లో ముగిశాయి. జొమాటో, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఎం అండ్ ఎం, ఏషియన్ పెయింట్స్, సన్‌ఫార్మా, ఎస్‌బీఐ, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ అండ్ టీ, టైటాన్ స్టాక్‌లు భారీగా నష్టపోయాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment