భారతీయ బెంచ్‌మార్క్ సూచీలు బీఎస్‌ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 సోమవారం అధిక స్థాయిలో ప్రారంభమయ్యాయి.ప్రారంభ సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 420 పాయింట్లు లేదా 0.52 శాతం పెరిగి 81,645 వద్ద, నిఫ్టీ 50 108 పాయింట్లు లేదా 0.44 శాతం పెరిగి 24,962 వద్ద పయనిస్తున్నాయి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఏషియన్ పెయింట్స్, విప్రో టాప్ గెయినర్స్‌గా లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు టాటా కన్య్సూమర్ ప్రొడక్ట్స్, కొటక్ మహీంద్రా, బీపీసీఎల్, భారతీ ఎయిర్‌టెల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ టాప్ లూజర్స్‌గా భారీ నష్టాల్లో చలిస్తున్నాయి.
కాగా సోమవారం ఉదయం చైనా సెంట్రల్ బ్యాంక్ ప్రకటించిన రేటు తగ్గింపును ట్రేడర్లు అంచనా వేయడంతో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మార్కెట్లు స్వల్పంగా పెరిగాయి. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఒక సంవత్సరం రుణ ప్రైమ్ రేటుని 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 3.1 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. అయితే ఐదేళ్ల ఎల్‌పీఆర్ 3.6 శాతానికి తగ్గింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment