దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ప్రారంభమై నష్టాల్లోనే ట్రేడింగ్ ముగించాయి. నిఫ్టీ 65.95 పాయింట్లు నష్టపోయి 22,031 వద్ద, సెన్సెక్స్ 193 పాయింట్లు దిగజారి 73,134 వద్దకు చేరింది.
సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, టైటాన్, ఐటీసీ, మారుతిసుజుకీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎల్ అండ్ టీ, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో ముగిశాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో, ఎన్‌టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టెక్‌మహీంద్రా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, సన్‌ఫార్మా, టీసీఎస్, ఎం అండ్ ఎం షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.
ఇటీవల భారీగా పెరిగిన ఐటీ, రిలయన్స్ వంటి స్టాక్‌ల్లో మదుపరులు మంగళవారం లాభాలు స్వీకరించినట్లు నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లు దాదాపు గత 11 ఏళ్ల నుంచి నెలవారీగా గమనిస్తే ప్రతి జనవరి నెలలో నష్టాల్లోకే జారుకున్నాయి. కానీ ఈసారి అది పునరావృతం కాదని అంటున్నారు. ఈక్విటీలో మదుపుచేస్తున్న ఇన్వెస్టర్లు భారత మార్కెట్లపై ఎంతో ఆశాజనకంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీర్ఘకాలంగా స్టాక్‌మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారు తాజాగా విడుదల చేస్తున్న త్రైమాసిక ఫలితాలను గమనించాలి. దాంతోపాటు కంపెనీ యాజమాన్యం తమ భవిష్యత్తు కార్యాచరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో తెలుసుకుని ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment