బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్‌ఈ (BSE) సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ (NSE) నిఫ్టీ50 కొత్త సంవత్సరం మొదటి ట్రేడింగ్ సెషన్‌ను లాభాలతో ముగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ బుధవారం 368.40 పాయింట్లు లేదా 0.47 శాతం పెరిగి 78,507.41 వద్ద స్థిరపడింది. ఈ ఇండెక్స్ ఈరోజు 78,756.49 - 77,898.30 రేంజ్‌లో ట్రేడ్ అయింది.
అదేవిధంగా నిఫ్టీ 50 దాని మునుపటి ముగింపుతో పోలిస్తే 98.10 పాయింట్లు లేదా 0.41 శాతం పెరిగి 23,742.90 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 రోజు గరిష్ట స్థాయి 23,822.80 వద్ద కనిపించగా, రోజు కనిష్ట స్థాయి 23,562.80 వద్ద ఉంది.
మారుతీ సుజుకీ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, లార్సెన్ & టూబ్రో, టాటా మోటార్స్ 3.01 శాతం వరకు లాభపడటంతో నిఫ్టీ50లోని 50 స్టాక్స్‌లో 37 గ్రీన్‌లో ముగిశాయి. మరోవైపు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హిందాల్కో, అదానీ పోర్ట్స్, ఓఎన్‌జీసీ, టాటా స్టీల్ నష్టాలతో ముగిశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు 2025 మొదటి ట్రేడింగ్ రోజు బుధవారం ఉదయం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:37 సమయానికి నిఫ్టీ(Nifty) 26 పాయింట్లు నష్టపోయి 23,617కు చేరింది. సెన్సెక్స్(Sensex) 82 పాయింట్లు దిగజారి 78,067 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 108.48 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 74.64 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.57 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.43 శాతం నష్టపోయింది. నాస్‌డాక్ 0.9 శాతం దిగజారింది.
ఈవారం మార్కెట్లు స్తబ్దుగానే సాగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లను ఉత్తేజపరిచే సంఘటనలు ఏవీ లేకపోవడం, విదేశీ మదుపర్ల నిరాసక్తత ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. మరోపక్క రూపాయి(Rupee) బలహీనపడటం, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి త్వరలో వెలువడబోయే త్రైమాసిక ఫలితాలపై అంచనాలు అంతంతమాత్రంగా ఉండటం కూడా సెంటిమెంట్‌ను ప్రభావితం చేయవచ్చు. అలాగే ఒకటో తేదీన వెలువడే, జీఎస్టీ వసూళ్ల గణాంకాలు, వాహన విక్రయాల వివరాలు మార్కెట్ ను ప్రభావితం చేస్తాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment