దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 324 పాయింట్లు నష్టపోయి 23,559 వద్దకు చేరింది. సెన్సెక్స్ 984 పాయింట్లు దిగజారి 77,690 వద్ద ముగిసింది. దాంతో ఈక్విటీ మార్కెట్‌లో ఒక్కరోజే దాదాపు రూ.5 లక్షల కోట్ల మేర సంపద ఆవిరైంది.
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్‌పీఐ) ఇటీవల దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా తమ ఇన్వెస్ట్‌మెంట్లను ఉపసంహరించుకుంటున్నారు. ఈ నెల ప్రారంభం నుంచి రోజూ సరాసరి రూ.4వేల కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తున్నారు. దాంతో మార్కెట్‌లు నష్టాల్లో ముగుస్తున్నాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫెడరల్ రిజర్వ్ మానిటరీ పాలసీ మీటింగ్‌లో భాగంగా 25 బేసిస్ పాయింట్లు కీలక వడ్డీరేట్లలో కోత విధించింది. అయితే శుక్రవారం ఫెడ్ ఛైర్మన్ జెరొమ్ పావెల్ యూఎస్ ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి ఫెడ్ మినట్స్ మీటింగ్‌లో ప్రసంగించనున్నారు.
ఇదీ చదవండి: నాలుగేళ్లలో 45.7 కోట్లకు శ్రామికశక్తి
సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్. ఎన్‌టీపీసీ, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి. ఎం అండ్ ఎం, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్‌సర్వ్ కంపెనీ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment