
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 వరకు నిఫ్టీ 50 పాయింట్లు దిగజారి 21,614 వద్ద కదలాడుతోంది. సెన్సెక్స్ 219 పాయింట్ల నష్టపోయి 71,673 వద్దకు చేరింది.
అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల వంటి అంశాల మధ్య మార్కెట్లు నష్టాల్లోకి జారుకుంటున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మంగళవారం మార్కెట్‌లో ఎఫ్‌ఐఐలు రూ.1602 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు. డీఐఐలు రూ.1959 కోట్లు విలువైన షేర్లు విక్రయించారు.
సెన్సెక్స్ 30 సూచీలో భారతిఎయిర్‌టెల్, ఎం అండ్ ఎం, ఎన్‌టీపీసీ, ఆల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే, మారుతి సుజుకీ, టాటా మోటార్స్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, సన్‌ఫార్మా, ఎస్‌బీఐ, టైటాన్ లాభాల్లో ట్రేడవుతున్నాయి. విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, పవర్‌గ్రిడ్ స్టాక్‌లు నష్టాల్లోకి జారుకున్నాయి.