దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ 122 పాయింట్లు నష్టపోయి 21,453కు చేరింది. సెన్సెక్స్ 352 పాయింట్లు దిగజారి 71,147 వద్ద ట్రేడవుతోంది.
ఈక్విటీ మార్కెట్లో ఎఫ్‌ఐఐలు ఎప్పుడూ లేనంతగా రూ.10,578.13 కోట్లు విలువైన షేర్లు విక్రయించారు. డీఐఐలు రూ.4006.44 కోట్లు విలువ చేసే షేర్లు కొనుగోలు చేశారు. ఇలా మార్కెట్‌లో షేర్లు విక్రయించడం కేవలం ఇండియా మార్కెట్‌లోనే కాదు, ఆసియా మార్కెట్‌లోని తైవాన్, కొరియా, హాంగ్‌కాంగ్‌లో మొత్తం దాదాపు బుధవారం ఒకేరోజు రూ.45వేల కోట్లు ఎఫ్‌ఐఐలు విక్రయించారు. డాలర్ ఇండెక్స్ 103.37కు చేరింది. యూఎస్ రిటైల్ సేల్స్ డిసెంబర్ నెలలో పెరిగినట్లు కథనాలు వస్తున్నాయి. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ 78.03 డాలర్లుగా ఉంది.
అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు స్టాక్ (8.46%) బుధవారం నష్టపోవడంతో సూచీలు భారీగా దిగజారాయి. నిఫ్టీ కోల్పోయిన మొత్తం 460 పాయింట్లలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వాటాయే 235 పాయింట్లు కావడం గమనార్హం.
యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లపై ప్రభావం చూపించే అమెరికా డిసెంబర్ ద్రవ్యోల్బణ డేటా, ఉపాధి కల్పన గణాంకాలు అంచనాలకు మించి నమోదడవడంతో ‘వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా’ అంచనాలు తెరపైకి వచ్చాయి. దీంతో అమెరికాలో పదేళ్ల కాల పరిమితి కలిగిన బాండ్లపై రాబడులు(4.04%) ఒక్కసారిగా పెరిగాయి. విదేశీ పెట్టుబడులు ఈక్విటీల నుంచి బాండ్లలోకి తరలిపోతాయనే ఆందోళనలు అధికమయ్యాయి. అలాగే క్రూడాయిల్‌తో పాటు ఇతర కమోడిటీల ధరల పెంపునకు కారణమయ్యే డాలర్ ఇండెక్స్ సైతం నెలరోజుల గరిష్టానికి చేరడమూ ప్రతికూల ప్రభావాన్ని చూపింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment