దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:38 సమయానికి నిఫ్టీ(Nifty) 79 పాయింట్లు నష్టపోయి 23,448కు చేరింది. సెన్సెక్స్(Sensex) 229 పాయింట్లు దిగజారి 77,395 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 109.2 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 77.22 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.69 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో స్వల్ప లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.16 శాతం లాభపడింది. నాస్‌డాక్ 0.06 శాతం దిగజారింది.
ఇదీ చదవండి: రేడియో వ్యాపారం మూసివేత
మార్కెట్ రేటింగ్‌కు హెచ్‌ఎస్‌బీసీ కోత..
అంతర్జాతీయ బ్రోకరేజ్ దిగ్గజం హెచ్‌ఎస్‌బీసీ(HSBC).. భారత ఈక్విటీ మార్కెట్ రేటింగ్‌ను ‘ఓవర్‌వెయిట్’ నుంచి ‘న్యూట్రల్’కి తగ్గించింది. కార్పొరేట్ ఆదాయాలు నెమ్మదించడం, అధిక వాల్యుయేషన్లు ఇందుకు కారణాలుగా చెప్పుకొచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2025)గానూ నిఫ్టీ 50 కంపెనీల ఆదాయ వృద్ధి అంచనాలను గణనీయంగా 15% నుంచి 5%కి తగ్గించింది. ఈ ఏడాది చివరి నాటికి సెన్సెక్స్ 85,990 స్థాయికి చేరొచ్చని అంచనా వేసింది. గురువారం సెన్సెక్స్ ముగింపు (77,620)తో పోలిస్తే 10% మాత్రమే అధికం.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment