నిఫ్టీ 50 ఇండెక్స్ సోమవారం చరిత్రాత్మక మార్కు 24,999.75ను తాకింది. నవంబర్ 1995లో 1,000 పాయింట్లతో ప్రారంభమైన నిఫ్టీ సూచీ 25,000 మార్కును చేరడానికి సుమారు 29 ఏళ్లు పట్టింది. ఈ క్రమంలో అంతర్జాతీయ అనిశ్చితులు, భౌగోళిక అస్థిరత, ఆర్థికమాంద్యం వంటి ఎన్నో ఒడిదొడుకులను అధిగమించింది. దీర్ఘకాలిక వ్యూహంతో పెట్టుబడులు కొనసాగిస్తే స్టాక్‌మార్కెట్‌లో మంచి రాబడులు సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిఫ్టీ 1,000 నుంచి 25,000 మార్కు చేరడానికి పట్టిన సమయాన్ని తెలుసుకుందాం.
ఇదీ చదవండి: నిఫ్టీ 25,000 పాయింట్లకు..?
1000 నుంచి 2,000 మార్కు-9 ఏళ్ల, 1 నెల 10 రోజులు
3000 మార్కు-1 సంవత్సరం 2 నెలలు
4,000 మార్కు-1 సంవత్సరం
5,000 మార్కు-10 నెలలు
6,000 మార్కు-2 నెలలు
7,000 మార్కు-6.5 సంవత్సరాలు
8,000 మార్కు-4 నెలలు
9,000 మార్కు-రెండున్నరేళ్లు
10,000 మార్కు-4 నెలలు
10,000 నుంచి 20,000కి చేరుకోవడానికి 6 సంవత్సరాలు
21,000 మార్కు-61 సెషన్లు
22,000 మార్కు-ఒక నెల
23,000 మార్కు-5 నెలలు
24,000 మార్కు- నెల కంటే తక్కువ సమయం
24,999.75 మార్కు-రెండున్నర నెలలు
Comments
Please login to add a commentAdd a comment