
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు నేడు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 9.55 గంటల సమయంలో నిఫ్టీ 149 పాయింట్ల లాభంతో 17,695వద్ద, సెన్సెక్స్ 489.99 పాయింట్ల లాభంతో 59,417.32 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి.
డీఎల్ ఎఫ్, గోద్రెజ్, పిరమల్ పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, ఇండియన్ హోటల్, టాటాపవర్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఐసీఐసీఐ లాంబార్డ్, స్ట్రిడ్స్ ఫార్మా, బాలకృష్ణ ఇండస్ట్రీస్ లిమిటెడ్, పేజ్ ఇండస్ట్రీస్, ఏసీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.