దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 52 పాయింట్లు లాభపడి 23,229కు చేరింది. సెన్సెక్స్(Sensex) 252 పాయింట్లు ఎగబాకి 76,767 వద్ద ట్రేడవుతోంది. ఇటీవల భారీగా పడిపోయిన మార్కెట్‌లో రిలీఫ్ ర్యాలీ కనిపిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ స్థాయిల్లో మార్కెట్ స్థిరపడాలంటే కొంత సమయం వేచి ఉండాలని సూచిస్తున్నారు.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 109.23 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 80 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.79 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో మిశ్రమంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.1 శాతం లాభపడింది. నాస్‌డాక్ 0.2 శాతం దిగజారింది.
ఇదీ చదవండి: ‘మీ లాభాల కోసం మేం చావలేం’
రూపాయి భారీగా పతనమవుతుంది. అమెరికా 10 ఏళ్లకు సంబంధించి బాండ్ ఈల్డ్‌లు పెరుగుతున్నాయి. యూఎస్ డాలర్ ఇండెక్స్ అధికమవుతుంది. ఈరోజు రిలీఫ్ ర్యాలీ ట్రాప్‌లోపడి ట్రేడర్లు ఎలాంటి పొజిషన్లు తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకొంత కాలం వేచి చూసి సూచీలు ముఖ్యమైన లెవల్స్ దాటి స్థిరపడితేనే పొజిషన్ తీసుకోవాలని చెబుతున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment