
ఆర్బీఐ పాలసీ , అంతర్జాతీయ స్థాయిలో సానుకూల పరిస్థితుల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ గురువారం(డిసెంబర్ 12, 2021) ఉదయం లాభాలతో మొదలైంది. అయితే కాసేపటికే స్వల్ప నష్టాల్లోకి ట్రేడ్ అవుతూ.. కొనసాగుతోంది.
బుధవారం మార్కెట్ ముగిసే సమయానికి 1016 పాయింట్ల లాభంతో 58,649 పాయింట్ల దగ్గర ముగిసింది. మరోవైపు నిఫ్టీ 17,469 దగ్గర క్లోజయ్యింది. కానీ, గురువారం ఉదయం లాభాలతో మొదలై.. ఆ వెంటనే స్వల్ప నష్టాల్లోకి జారుకుంది.
ఉదయం 9గం. 45ని. సమయానికి సెన్సెక్స్ 21 పాయింట్లు నష్టపోయి 58,628 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 6 పాయింట్లు కోల్పోయి 17,462 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది.