దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ 155 పాయింట్లు నష్టపోయి 21,835కు చేరింది. సెన్సెక్స్ 529 పాయింట్లు దిగజారి 71,955 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 106.2 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 87 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.63 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.2 శాతం నష్టాలపాలైంది. నాస్‌డాక్ 0.5 శాతం దిగజారింది.
ఎన్‌ఎస్‌ఈ ఏప్రిల్ 24 నుంచి నిఫ్టీ నెక్ట్స్ 50 ఇండెక్స్‌కి సంబంధించిన డెరివేటివ్ కాంట్రాక్టులను ప్రారంభించనుంది. ఇందుకు సెబీ నుంచి అనుమతులు వచ్చినట్లు తెలిపింది. 10 లాట్ సైజుతో 3 నెలల ఇండెక్స్ ఫ్యూచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ కాంట్రాక్టులను ప్రవేశపెట్టనున్నట్లు, వీటి కాలవ్యవధి ఎక్స్‌పైరీ నెలలో చివరి శుక్రవారంతో ముగుస్తుందని పేర్కొంది. 2024 మార్చి నాటికి ఈ ఇండెక్స్‌లో ఆర్థిక సర్వీసుల రంగం స్టాక్స్ వాటా 23.76 శాతంగా, క్యాపిటల్ గూడ్స్ రంగం వాటా 11.91 శాతం, కన్జూమర్ సరీ్వసెస్ వాటా 11.57 శాతంగా ఉంది. 1997 జనవరి 1న ఈ ఇండెక్స్‌ను ప్రవేశపెట్టారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment