దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల బాటపట్టాయి. సూచీలు స్వల్ప లాభాలతో ప్రారంభమై చివరికి భారీ నష్టాలపాలయ్యాయి. మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 551 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 140 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 521 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 366 పాయింట్లు నష్టపోయాయి. రెండో త్రైమాసిక ఫలితాలు విడుదల చేస్తున్న వేళ మార్కెట్ నిపుణులు కంపెనీల ఆదాయాలు ప్రతికూలంగా ఉంటాయని అంచనాలు వేసిన వేళ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి మెుదలైంది. దీనికి అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలు భారీ నష్టాలకు దారితీశాయి.
బ్యాంకింగ్, పవర్ రంగాల్లోని కంపెనీలు ప్రధానంగా మార్కెట్లను నష్టాలోకి లాగాయి. ఫార్మా స్టాక్స్ లాభాల్లో ట్రేడయ్యాయి. ఇదే క్రమంలో బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి.
ఎన్ఎస్ఈలో సిప్లా, డాక్టర్ రెడ్డీస్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఎస్‌బీఐ లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఓఎన్‌జీసీ, మారుతీ, బ్రిటానియా, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో కంపెనీల షేర్లు లాభాలతో పయణించాయి.
బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎన్టీపీసీ, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్జూమర్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, గ్రాసిమ్, అపోలో హాస్పిటల్స్, విప్రో, బీపీసీఎల్ షేర్లు నష్టాల్లో నిలిచాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment