దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం ప్రతికూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. ఏ దశలోనూ మార్కెట్లకు కొనుగోళ్ల అండ లభించలేదు. వారాంతం కావడంతో మదుపర్ల అమ్మకాలు, రూపాయి బలహీన పడడం, అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు, కీలక స్టాక్స్‌లో అమ్మకాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి.
ఉదయం సెన్సెక్స్ 66,068 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 65,895.41 దగ్గర కనిష్ఠాన్ని తాకింది. చివరకు కొంద పుంజుకుని 66,282.74 పాయింట్ల దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 19,654 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 19,800 మార్క్ దగ్గర ఎగువ స్థాయికి చేరుకుంది. చివరకు గురువారం ముగింపుతో పోలిస్తే 43 పాయింట్లు నష్టపోయి 19,751 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.25 వద్ద నిలిచింది.
సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, నెస్లే ఇండియా, మారుతిసుజుకీ, టీసీఎస్, సన్‌ఫార్మా, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాన్ ఫైనాన్స్, హెచ్‌యూఎల్, ఎల్ అండ్ టీ, పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి. యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, విప్రో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా స్టీల్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ , ఏషియన్ పెయింట్స్, ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా, రిలయన్స్ షేర్లు నష్టాల్లో స్థిరపడ్డాయి.
బీఎస్‌ఈలో మొత్తం 3,820 షేర్లు ట్రేడ్ అవగా, 1,804 స్టాక్‌లు లాభాలతో ముగిశాయి. గతంతో పోలిస్తే 156 షేర్లు యథాతథంగా ఉన్నాయి. రోజులో 317 షేర్లు వాటి ఎగువ సర్క్యూట్‌ను తాకగా, 157 షేర్లు లోయర్ సర్క్యూట్ స్థాయిలో ట్రేడయ్యాయి.
జై కార్ప్, ఐటీఐ, ఏడీఎఫ్ ఫుడ్స్ 20 శాతం చొప్పున పుంజుకోగా, స్పైస్‌జెట్ 19 శాతానికి పైగా లాభపడింది. టెక్స్‌మాకో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ హోల్డింగ్స్ 16 శాతం ర్యాలీ కాగా, ఏజీఐ గ్రీన్‌పాక్ 15 శాతం పెరిగింది. ఆంధ్రా పెట్రోకెమికల్స్, ఇర్కాన్ ఇంటర్నేషనల్ షేర్లు 10 శాతం పెరిగాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment