భారత స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (Foreign Institutional Investors) 2025 జనవరిలో ఇప్పటివరకు దాదాపు రూ.50,000 కోట్లకుపైగా పెట్టుబడిని ఉపసంహరించుకున్నారు. ఈ భారీ అవుట్ ఫ్లో సెన్సెక్స్, నిఫ్టీలపై గణనీయంగా ప్రభావం చూపుతోంది. ఎఫ్‌ఐఐల అమ్మకాల దోరణి కొనసాగుతుండడంతో సూచీలు పతనమవుతున్నాయి. ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలు వెలువరిస్తున్న త్రైమాసిక ఫలితాలు పెద్ద ఇన్వెస్టర్లకు భరోసా ఇవ్వలేకపోతున్నాయి. వార్షిక ప్రాతిపదికన చాలా కంపెనీల లాభాల వృద్ధి స్థిరంగానే ఉంది.
ట్రంప్ ప్రభావం..
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టడంతో భారత్ మార్కెట్‌లో ఎఫ్‌ఐఐ(FII)ల అమ్మకాల్లో వేగం పెరుగుతోంది. అందుకుతోడు ట్రంప్ ‘కంట్రీఫస్ట్’ దోరణితో తీసుకుంటున్న నిర్ణయాలు మరింత భయాందోళనలు రేకిత్తిస్తున్నాయి. ట్రంప్ అమెరికా అనుకూల విధానాల వల్ల చాలామంది ఇన్వెస్టర్లు యూఎస్‌లోనే పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే భారత్‌లో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులు వాటిని విత్‌డ్రా చేసి అమెరికా మార్కెట్‌లో ఇన్వెస్ట్(Invest) చేయాలని భావిస్తున్నారు. దాంతో భారత మార్కెట్లు భారీగా కుదేలవుతున్నాయి. ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోతను ఇప్పటికే ప్రారంభించింది. అమెరికా బాండ్ ఈల్ట్‌లు పెరుగుతున్నాయి.
ఇదీ చదవండి: అమెరికా చమురు ఎగుమతులు పెంపు
డాలర్ బలపడటం, విదేశీ నిధుల ఉపసంహరణతో అమెరికా డాలర్(US Dollar)తో పోలిస్తే ఇటీవల భారత రూపాయి 3 శాతం క్షీణించి రికార్డు స్థాయిలో రూ.86.70 వద్ద ముగిసింది. ఈ క్షీణత భారత స్టాక్ మార్కెట్‌పై ఒత్తిడి పెంచింది. ఈక్విటీ మార్కెట్లు స్థిరపడాలంటే బాండ్ ఈల్డ్స్, యూఎస్ డాలర్ నిలకడగా ఉండడం చాలా అవసరమని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment