మిత్రమా అందుకో శుభాకాంక్షలు: బిల్‌గేట్స్‌ అద్భుతమైన వీడియో  | Bill Gates Wishes Warren Buffett On His 93rd Birthday With A Special Memories Video Viral - Sakshi
Sakshi News home page

మిత్రమా అందుకో శుభాకాంక్షలు: బిల్‌గేట్స్‌ అద్భుతమైన వీడియో 

Published Wed, Aug 30 2023 7:20 PM | Last Updated on Wed, Aug 30 2023 8:04 PM

Bill Gates Wishes Warren Buffett On His 93rd Birthday With A Special Memories Video - Sakshi

Happy Birthday Warren Buffett ప్రపంచంలోనే గొప్ప పెట్టుబడిదారుడి, అపరకుబేరుడు బెర్క్‌షైర్ హాత్వే , ఛైర్మన్‌,సీఈవో వారెన్‌  బఫ్ఫెట్‌  పుట్టిన రోజు ఆగస్టు 30. ఈ సందర్బంగా మైక్రోసాప్ట్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్‌ గేట్స్‌ తన స్నేహితుడికి శుభాకాంక్షలందించారు.దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన వీడియోను షేర్‌ చూస్తూ వినూత్నంగా విషెస్‌ తెలిపారు. దీంతో ఇది నె టిజనులను బాగా ఆకట్టుకుంటోంది

1920లో నెబ్రాస్కాలోని ఒమాహాలో ఆగస్టు 30న జన్మించారు వారెన్‌ బఫ్ఫెట్‌.  93ఏళ్ల ఇన్వెస్టింగ్ లెజెండ్ వారెన్ బఫ్ఫెట్ ప్రపంచంలో అత్యంత విజయ వంతమైన పెట్టుబడిదారులలో ఒకరిగా పేరు గడించారు. ఇన్వెస్టింగ్‌ తీరు మాంద్యాన్ని ఎలా ఎదుర్కోవాలి, పెట్టుబడులపై లాభాలు ఎలా సాధించాలి లాంటి సలహాలు  ఇన్వెస్టర్లకు పెద్ద  సక్సెస్‌మంత్రాలా పని చేస్తాయి. వ్యాపారవేత్త, తండ్రి హోవార్డ్ గ్రాహం బఫ్ఫెట్ ప్రేరణతో  60కి పైగా కంపెనీలను కలిగి ఉన్న బెర్క్‌షైర్ హాత్వే  సీఈవోగా కంపెనీని విజయవంతంగా నడిపిస్తున్నారు. మీ మీద మీ పెట్టుబడే పెద్ద సక్సెస్‌ అంటారు ఒరాకిల్‌ ఆఫ్‌ ఒమాహాగా పాపులర్‌ అయిన వారెన్‌  బఫ్ఫెట్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement