ఆపిల్ రికార్డు బ్రేక్ చేసింది
ఆపిల్ రికార్డు బ్రేక్ చేసింది
Published Wed, Feb 15 2017 11:56 AM | Last Updated on Mon, Aug 20 2018 3:07 PM
శాన్ఫ్రాన్సిస్కో : టెక్ దిగ్గజం ఆపిల్ 2015 నాటి రికార్డు బ్రేక్ చేసింది. ఇంట్రాడేలో ఆపిల్ షేర్ ధర మంగళవారం రికార్డు స్థాయిలోకి ఎగిసింది. ఆల్ టైమ్ గరిష్టంగా స్టాక్ ధర 135.09 డాలర్ల(రూ.9039.61)గా నమోదైంది. గత రెండేళ్లలో ఈ మేర పెరగడం ఇదే తొలిసారి. గతంలో 2015 ఏప్రిల్లో షేరు ధర 134.54 డాలర్లుగా నమోదై రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఆ రికార్డును ఆపిల్ బ్రేక్ చేసింది. ఐఫోన్ 10వ వార్షికోత్సవం ఇన్వెస్టర్లలో కొత్త ఆశలను చిగురించింది. డిసెంబర్ క్వార్టర్లో ఆపిల్లో బెర్కషైర్ హాత్అవే స్టాక్ను మూడింతలు పెంచినట్టు ప్రపంచ స్టాక్ మార్కెట్లో లెజండరీ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ చెప్పారు. తన ఆ కంపెనీ షేర్లను 15.2 మిలియన్ల నుంచి 57.4 మిలియన్లకు పెంచినట్టు తెలిపారు.
లెజెండరీ ఇన్వెస్టర్ల బఫెట్ తన ఇంటరెస్ట్ను ఆపిల్లో పెంచడం, వాల్స్ట్రీట్లో పాజిటివ్ సెంటిమెంట్ను కల్పిస్తోందని విశ్లేషకులంటున్నారు. ఐఫోన్ 10వ వార్షికోత్సవ సందర్భంగా తీసుకురాబోతున్న మోడల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉంటుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఆపిల్ నుంచి ఇంకా మంచి స్మార్ట్ఫోన్ వస్తుందని అంచనా వేస్తున్నారు. రెండేళ్ల క్రితం తీసుకొచ్చిన ఐఫోన్ 6ఎస్కు మంచి విక్రయాలు నమోదైనట్టు వాల్స్ట్రీట్ అంచనావేస్తోంది. అంతేకాక జనవరి 31న విడుదల చేసిన డిసెంబర్ త్రైమాసిక ఫలితాల్లోనూ ఈ కాలిఫోర్నియా కంపెనీ మెరుగైన ఫలితాలను ప్రకటించింది. దీంతో ఆపిల్ షేర్లు రికార్డ్స్ సృష్టిస్తున్నాయి.
Advertisement