intraday record
-
రివ్వున దూసుకుపోయిన టాటా మోటార్స్ షేర్లు
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్సేంజీలో టాటా మోటార్స్ షేరు 1.3 శాతం బలపడింది. ఎలక్ట్రిక్ వాహన తయారీకి ఇటీవలే ఏర్పాటు చేసిన అనుబంధ సంస్థలో ఏడీక్యూతో కలిపి టీపీజీ రైజ్ క్లయిమేట్ బిలియన్ డాలర్లు (రూ. 7,550 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా టాటా షేర్లు జూమ్మంటూ దూసుకుపోయాయి. దీంతో షేర్ వాల్యూ గరిష్టంగా రూ. 421 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో అయితే రూ. 436 సమీపంలో ట్రేడయ్యి 52 వారాల గరిష్టాన్ని తాకింది. భారీ పెట్టుబడి ఎలక్ట్రిక్ వాహన తయారీకి ఇటీవలే ఏర్పాటు చేసిన అనుబంధ సంస్థలో ఏడీక్యూతో కలిపి టీపీజీ రైజ్ క్లయిమేట్ బిలియన్ డాలర్లు(రూ. 7,550 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు టాటా మోటార్స్ తాజాగా పేర్కొంది. తద్వారా 11–15 శాతం మధ్య వాటాను పొందనున్నట్లు దేశీ ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ తెలియజేసింది. 9.1 బిలియన్ డాలర్ల ఎంటర్ప్రైజ్ విలువలో తాజా పెట్టుబడులు లభిస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. భవిష్యత్‌లో షేర్లుగా మార్పిడయ్యే(తప్పనిసరి) సెక్యూరిటీల జారీ ద్వారా ఈవీ అనుబంధ సంస్థలో ఏడీక్యూ, టీపీజీ రైజ్ వాటాలను సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. 18 నెలల్లోగా రెండంచెలలో పెట్టుబడులు లభించనున్నట్లు తెలియజేసింది. అబుధాబి ప్రభుత్వానికి వ్యూహాత్మక భాగస్వామిగా వ్యవహరించే ఏడీక్యూ దేశ, విదేశీ కంపెనీలలో భారీగా ఇన్వెస్ట్ చేస్తుంటుంది. ప్రధాన పాత్రకు సిద్ధం తమ ఎలక్ట్రిక్ వాహన ప్రయాణంలో టీపీజీ రైజ్ క్లయిమేట్ జత కలవడం ఆనందాన్నిస్తున్నట్లు టాటా మోటార్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ పేర్కొన్నారు. తద్వారా దేశీ మార్కెట్లో మార్పులు తీసుకురాగల ఈవీ విభాగంలో మరిన్ని పెట్టుబడులకు వీలుంటుందని తెలియజేశారు. ఈ బాటలో 2030కల్లా ఎలక్ట్రిక్ వాహన వాటాను 30 శాతానికి పెంచే ప్రభుత్వ ప్రణాళికలు(విజన్)కు అనుగుణంగా ప్రధాన పాత్రను పోషించేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. టాటా మోటార్స్కున్న ప్రస్తుత పెట్టుబడులు, సామర్థ్యాలను కొత్త ఈవీ కంపెనీ వినియోగించుకోనున్నట్లు తెలియజేశారు. భవిష్యత్ పెట్టుబడులను ఎలక్ట్రిక్ వాహనాలు, బీఈవీ ప్లాట్పామ్స్, అడ్వాన్స్డ్ ఆటోమోటివ్ టెక్నాలజీలు, చార్జింగ్ మౌలిక సదుపాయాలు, బ్యాటరీల అభివృద్ధికి వెచ్చించనున్నట్లు వివరించారు. రానున్న ఐదేళ్లలో 10 ఈవీలతోకూడిన పోర్ట్‌ఫోలియోను అభివృద్ధి చేయనున్నట్లు తెలియజేశారు. టాటా పవర్ భాగస్వామ్యంతో ఛార్జింగ్ మౌలికసదుపాయాలను వేగవంతంగా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. దేశీయంగా ఈవీలకు భారీ అవకాశాలున్నట్లు టీపీజీ రైజ్ క్లయిమేట్ వ్యవస్థాపక భాగస్వామి జిమ్ కౌల్టర్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. పర్యావరణహిత సొల్యూషన్లకు పెరుగుతున్న డిమాండ్, ప్రభుత్వ విధానాలు ఇందుకు సహకరించనున్నట్లు పేర్కొన్నారు. చదవండి: అదృష్టమంటే ఇదేనేమో..! 4 రోజుల్లో రూ.6 లక్షల కోట్లు సొంతం...! -
రికార్డ్ స్థాయిల నుంచి పతనం
ఇంట్రాడేలో సూచీలు ఆల్‌టైమ్ హైలను తాకినట్లుగానే పలు షేర్లు జీవిత కాల గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. ఏషియన్ పెయింట్స్, అతుల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, గోద్రేజ్ ప్రోపర్టీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇండియన్ హోటల్స్, ముత్తూట్ ఫైనాన్స్, పిడిలైట్ ఇండస్ట్రీస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. నాలుగు రోజుల స్టాక్‌మార్కెట్ లాభాలకు బుధవారం బ్రేక్ పడింది. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువగానే వర్షాలు కురవవచ్చనే అంచనాలు, ముడి చమురు ధరలు భగ్గుమనడం...ఇన్వెస్టర్లను లాభాల స్వీకరణకు పురికొల్పాయి. దీంతో ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలకు పెరిగినప్పటికీ, సెన్సెక్స్, నిఫ్టీలు చివరకు నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 39,000 పాయింట్లు, నిఫ్టీ 11,700 పాయింట్ల దిగువకు పడిపోయాయి. అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. రోజంతా 443 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 180 పాయింట్లు పతనమై 38,877 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 69 పాయింట్లు నష్టపోయి 11,644 పాయింట్ల వద్దకు చేరింది. ఎల్‌నినోతో ‘తక్కువ’ వర్షాలు.... పసిఫిక్ మహా సముద్రంలో ఎల్‌నినో వృద్ది చెందుతోందని, ఫలితంగా ఈ ఏడాది సాధారణం కంటే తక్కువగానే వర్షాలు పడొచ్చనే అంచనాలను ప్రైవేట్ వాతావరణ సంస్థ, స్కైమెట్ వెలువరించింది. దీంతో వృద్ధి మందగించివచ్చనే భయాలతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ముడి చమురు ధరలు భగ్గుమనడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. బ్యారెల్ బ్రెంట్ చమురు ఐదు నెలల గరిష్ట స్థాయి, 70 డాలర్లకు చేరువ కావడం ప్రతికూల ప్రభావం చూపించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి పాలసీని ఆర్బీఐ నేడు(గురువారం) వెలువరించనున్నది. కీలక రేట్లను పావు శాతం మేర తగ్గించవచ్చనే అంచనాలున్నాయి. ఈ పావు శాతం రేట్ల కోతను మార్కెట్ ఇప్పటికే డిస్కౌంట్ చేసుకుందని విశ్లేషకులంటున్నారు. 443 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్ సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే ఆరంభమయ్యాయి. ఆసియా మార్కెట్ల జోష్‌తో మధ్యాహ్నం దాకా లాభాల్లోనే ట్రేడయ్యాయి. మధ్యాహ్నం తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో నష్టాల్లోకి జారిపోయాయి. సెన్సెక్స్ ఒక దశలో 213 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 230 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 443 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 48 పాయింట్లు లాభపడగా, మరో దశలో 84 పాయింట్లు నష్టపోయింది. ఇంట్రాడే గరిష్ట స్థాయిల నుంచి చూస్తే, సెన్సెక్స్ 393 పాయింట్లు, నిఫ్టీ 117 పాయింట్ల మేర నష్టపోయినట్లయింది. -
రెండో రోజూ రికార్డు...
స్టాక్ మార్కెట్లో లాభాల జోరు కొనసాగుతోంది. మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్లను సృష్టించింది. నిఫ్టీ 11,700 పాయింట్లపైకి ఎగబాకింది. వాహన, ఐటీ, బ్యాంక్ షేర్ల దన్నుతో వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్లోనూ స్టాక్ సూచీలు లాభపడ్డాయి. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం, ఆర్బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు, డాలర్‌తో రూపాయి మారకం 40 పైసలు బలపడి 68.74 వద్ద ముగియడం సానుకూల ప్రభావం చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్185 పాయింట్ల లాభంతో 39,057 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 11,713 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 39,000 పాయింట్లపైన ముగియడం ఇదే తొలిసారి, ఇక నిఫ్టీ 11,700 పాయింట్లపైకి చేరడం దాదాపు ఏడు నెలల తర్వాత ఇదే ప్రథమం. సెన్సెక్స్ ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, 39,122 పాయింట్లను తాకింది. సెన్సెక్స్ మొదలై 40 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో కొత్త ఆల్‌టైమ్ హై రికార్డ్‌లు సాధించడం విశేషం. ‘విదేశీ’ పెట్టుబడులతో స్థిరత్వం.... ఆర్బీఐ రేట్ల కోత అంచనాలకు తోడు కంపెనీల ఆర్థిక ఫలితాలు బాగా ఉంటాయనే భావనతో విదేశీ ఇన్వెస్టర్లు జోరుగా మన మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఇది మన మార్కెట్‌కు స్థిరత్వాన్ని కల్పిస్తోందని వారంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను తొలి పాలసీ నిమిత్తం ఆర్బీఐ మోనేటరీ పాలసీ కమిటీ(ఎమ్‌పీసీ) సమావేశం మంగళవారం ఆరంభమైంది. రెపోరేటును పావు శాతం మేర ఆర్బీఐ తగ్గిస్తుందన్న అంచనాలున్నాయి. రేట్ల నిర్ణయం రేపు(గురువారం) వెలువడుతుంది. తొలగిన అంతర్జాతీయ వృద్ధి అనిశ్చితి.... అమెరికా, చైనాల్లో తయారీ రంగ గణాంకాలు అంచనాలను మించాయి. దీంతో అంతర్జాతీయ వృద్ధిపై అనిశ్చితి తొలగిపోయింది. ఫలితంగా సోమవారం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియగా, మంగళవారం ఆసియా, యూరప్ మార్కెట్లు లాభపడ్డాయి. ఇది మన మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపించింది. సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. ఆ తర్వాత ఒడిదుడుకులకు గురైనా, ఇంట్రాడే, ముగింపులో జీవిత కాల గరిష్ట స్థాయి రికార్డ్లను సాధించింది. సెన్సెక్స్ @ 40 సంవత్సరాలు సెన్సెక్స్ మొదలై 40 ఏళ్లు పూర్తయింది. వాస్తవానికి 1986, జనవరి 2న సెన్సెక్స్ మొదలైంది. అయితే సెన్సెక్స్‌కు ఆధార(బేస్) తేదీగా 1979, ఏప్రిల్ 1ని తీసుకోవడంతో సోమవారంతో సెన్సెక్స్‌కు 40 వసంతాలు పూర్తయినట్లు లెక్క. 1979, ఏప్రిల్ 1న వంద పాయింట్లుగా ఉన్న సెన్సెక్స్ 40 ఏళ్ల తర్వాత 39,000 పాయింట్లపైకి ఎగబాకింది. డివిడెండ్లను కూడా లెక్కలోకి తీసుకుంటే సెన్సెక్స్ 56,000 పాయింట్లకు చేరినట్లు లెక్క అని బీఎస్ఈ ఎమ్డీ, సీఈఓ ఆశీష్ కుమార్ చౌహాన్ పేర్కొన్నారు. మొత్తం మీద సెన్సెక్స్ 16 శాతం చక్రగతి వృద్ధిని సాధించింది. మరింత విపులంగా చెప్పాలంటే 1979, ఏప్రిల్ 1న రూ. లక్ష ఇన్వెస్ట్ చేస్తే, ఈ 40 ఏళ్లలో దాని విలువ రూ.5.6 కోట్లకు చేరుతుంది. ఇదే కాలంలో ఫిక్స్డ్ డిపాజిట్లు, పుత్తడి, రియల్ ఎస్టేట్ తదితర ఆస్తులు 7–12 శాతం చక్రగతి రాబడులనిచ్చాయి. సెన్సిటివ్ ఇండెక్స్‌లో మొదటి రెండు పదాలు, చివరి పదం కలయికగా సెన్సెక్స్ పదాన్ని మొదటిసారిగా దీపక్ మోహొని అనే స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ వాడారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ సెన్సెక్స్‌లో ఆరు షేర్లు అలాగే కొనసాగుతున్నాయి. ఈ షేర్లు– ఐటీసీ, ఎల్ అండ్ టీ, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, టాటా స్టీల్. ఆల్‌టైమ్ హై రికార్డ్‌లు.. సూచీ ఇంట్రాడే క్లోజింగ్ సెన్సెక్స్ 39,122 39,057 సెన్సెక్స్ ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్‌లు సృష్టించడం గర్వకారణంగా ఉంది. – బీఎస్ఈ సీఈఓ అశీష్ కుమార్ చౌహాన్ -
ఆపిల్ రికార్డు బ్రేక్ చేసింది
శాన్ఫ్రాన్సిస్కో : టెక్ దిగ్గజం ఆపిల్ 2015 నాటి రికార్డు బ్రేక్ చేసింది. ఇంట్రాడేలో ఆపిల్ షేర్ ధర మంగళవారం రికార్డు స్థాయిలోకి ఎగిసింది. ఆల్ టైమ్ గరిష్టంగా స్టాక్ ధర 135.09 డాలర్ల(రూ.9039.61)గా నమోదైంది. గత రెండేళ్లలో ఈ మేర పెరగడం ఇదే తొలిసారి. గతంలో 2015 ఏప్రిల్‌లో షేరు ధర 134.54 డాలర్లుగా నమోదై రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఆ రికార్డును ఆపిల్ బ్రేక్ చేసింది. ఐఫోన్ 10వ వార్షికోత్సవం ఇన్వెస్టర్లలో కొత్త ఆశలను చిగురించింది. డిసెంబర్ క్వార్టర్లో ఆపిల్‌లో బెర్కషైర్ హాత్అవే స్టాక్‌ను మూడింతలు పెంచినట్టు ప్రపంచ స్టాక్ మార్కెట్లో లెజండరీ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ చెప్పారు. తన ఆ కంపెనీ షేర్లను 15.2 మిలియన్ల నుంచి 57.4 మిలియన్లకు పెంచినట్టు తెలిపారు. లెజెండరీ ఇన్వెస్టర్ల బఫెట్ తన ఇంటరెస్ట్‌ను ఆపిల్‌లో పెంచడం, వాల్‌స్ట్రీట్‌లో పాజిటివ్ సెంటిమెంట్‌ను కల్పిస్తోందని విశ్లేషకులంటున్నారు. ఐఫోన్ 10వ వార్షికోత్సవ సందర్భంగా తీసుకురాబోతున్న మోడల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉంటుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఆపిల్ నుంచి ఇంకా మంచి స్మార్ట్‌ఫోన్ వస్తుందని అంచనా వేస్తున్నారు. రెండేళ్ల క్రితం తీసుకొచ్చిన ఐఫోన్ 6ఎస్‌కు మంచి విక్రయాలు నమోదైనట్టు వాల్‌స్ట్రీట్ అంచనావేస్తోంది. అంతేకాక జనవరి 31న విడుదల చేసిన డిసెంబర్ త్రైమాసిక ఫలితాల్లోనూ ఈ కాలిఫోర్నియా కంపెనీ మెరుగైన ఫలితాలను ప్రకటించింది. దీంతో ఆపిల్ షేర్లు రికార్డ్స్ సృష్టిస్తున్నాయి.