Bilgates
-
వారెన్ బఫెట్ నుంచి బిల్ గేట్స్ నేర్చుకున్న పాఠం ఏంటంటే?
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ప్రతి సెకనును తన షెడ్యూల్ అనుగుణంగా పని చేసేవారు. అలా చేయడం తన విజయానికి కారణమని భావించేవారు. కానీ కొన్నేళ్లకు బిల్‌గేట్స్ తాను చేస్తుందని తప్పని భావించారు. అందుకు బెర్క్‌షైర్ హాత్వే సీఈఓ వారెన్ బఫెట్ కారణం.మైక్రోసాఫ్ట్ సీఈఓగా తన 25 ఏళ్ల పదవీకాలంలో బిల్ గేట్స్ ప్రతి సెకనును షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసేవారు. అయితే 2017లో తన స్నేహితుడు వారెన్ బఫెట్ కలిసి గేట్స్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా వారెన్ బఫెట్ షెడ్యూల్ తనకి చూపించినప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు ఓ సందర్భంలో వెల్లడించారు.ఆ సమయంలో బఫెట్ తన క్యాలెంటర్‌ను చూపించడం నాకు ఇంకా గుర్తింది. అందులో ఏమీ లేదు. కానీ ఆ షెడ్యూల్ నాకు ముఖ్యమైన పాఠాన్ని నేర్పింది. మీ షెడ్యూల్లో ప్రతి నిమిషాన్ని నింపడం మీ సీరియస్‌నెస్‌కు నిదర్శనం కాదు. మీరు చదవడానికి, ఆలోచించడానికి, రాయడానికి సమయం కేటాయించండి. జీవితంలో నిజమైన ప్రాముఖ్యతలేవో వారెన్ బఫెట్ నాకు తెలియజేశారు అని బిల్ గేట్స్ చెప్పుకొచ్చారు. -
రహస్యాలన్నీ బట్టబయలు.. ఎలాన్ మస్క్ బయోగ్రఫీలో ఏమేం ఉంటాయంటే
అపరకుబేరుడు ఎలాన్ మస్క్ బయోగ్రఫీ కాపీలు హాట్ కేకుల్లో అమ్ముడు పోతున్నాయి. ‘ఎలాన్ మస్క్’ పేరుతో విడుదలైన మస్క్ బయోగ్రఫీ కాపీలు కేవలం వారం రోజుల వ్యవధిలోనే 92,560 అమ్ముడుపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా బయోగ్రఫీ పుస్తకాలు ఎన్ని అమ్ముడు పోయాయో సిర్కానా అనే మీడియా సంస్థ ట్రాక్ చేస్తుంది. ఆ కంపెనీ అందించిన సమాచారం మేరకు విడుదలైన వారంలో ఎక్కువ మొత్తంలో అమ్ముడు పోయిన పుస్తకాల్లో మొదటిది యాపిల్ కో- ఫౌండర్ స్టీవ్ జాబ్స్ బయోగ్రఫీ కాగా.. రెండోది ఎలాన్ మస్క్ బయోగ్రఫీయేనని సిర్కానా వెల్లడించింది. వారంలోనే అన్ని పుస్తకాల ప్రొఫెసర్, ఆథర్, ప్రముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్ మాజీ సీఈవో వాల్టర్ సెఫ్ ఐజాక్సన్ (Walter Seff Isaacson) యాపిల్ కోఫౌండర్ స్టీవ్ జాబ్స్ బయోగ్రఫీని రాశారు. అయితే, అక్టోబర్ 5, 2011లో స్టీవ్ జాబ్స్ మరణించిన వారం రోజుల తర్వాత ఆ పుస్తకాన్ని విడుదల చేశారు. విడుదలైన వారం రోజుల్లో 3,83,000 కాపీలు అమ్ముడుపోయాయి. మస్క్ బయోగ్రఫీ కోసం రెండేళ్ల సమయం వాల్టర్ మస్క్ బయోగ్రఫీ రాసేందుకు సుమారు రెండేళ్ల పాటు శ్రమించారు. మస్క్ అటెండ్ అయ్యే సమావేశాలు. ఇచ్చిన ఇంటర్వ్యూలు, కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని, మస్క్ అనుచరుల్ని, సలహాదారుల్ని ఇలా అందరి నుంచి సమాచారం సేకరించి బుక్ రాశారు. ఎలాన్ మస్క్ బయోగ్రఫీ బుక్ ఎప్పుడు విడుదలైంది? Walter Isaacson's biography of Elon Musk sold 92,560 copies in its first week on sale! 📚 pic.twitter.com/WkfgtByzp6 — Dima Zeniuk (@DimaZeniuk) September 22, 2023 ఎలాన్ మస్క్ బయోగ్రఫీని వాల్టర్ ఐజాక్సన్ రాశారు. సెప్టెంబర్ 12,2023న విడుదల చేశారు. మస్క్ బయోగ్రఫీ బుక్‌లో ఏముంటుంది? ఎలాన్ మస్క్! ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. అలాంటి టార్చ్ బేరర్ బాల్యం, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, పలువురి మహిళలతో నెరిపిన సంబంధాలు, తన తండ్రి ఎర్రోల్ మస్క్‌తో ఉన్న అనుబంధాలతో సహా బిలియనీర్ జీవితంలోని అనేక కోణాలను వెల్లడించింది. పలు నివేదికల ప్రకారం.. మస్క్ గర్ల్ ఫ్రెండ్లు, మాజీ భార్యలు, మాజీ గర్ల్‌ఫ్రెండ్‌లు, పలువురి మహిళలతో సంతానం వంటి అనేక కొత్త విషయాలు మస్క్ జీవిత చరిత్రలో ఉన్నట్లు తేలింది. దీంతో పాటు టెస్లా కార్ల షేర్ల తగ్గింపు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపుకుడు బిల్‌గేట్స్‌తో వాగ్వాదం గురించి బయోగ్రఫీలో రాశారు. వాల్టర్ ఇప్పటికే వాల్టర్ ఇప్పటికే రాసిన ఐన్‌స్టీన్, బెంజిమన్ ఫ్రాంక్లిన్ పుస్తకాలు ఎక్కువగా అమ్ముడు పోయిన జాబితాలో నిలిచాయి. బయోగ్రఫీపై ఎలాన్ మస్క్ స్పందన Cool, although it’s kinda weird seeing so many close-up pics of my face 😂 — Elon Musk (@elonmusk) September 22, 2023 తన బయోగ్రఫీ కాపీలు ఊహించని విధంగా అమ్ముడుపోవడంపై మస్క్ స్పందించారు. ‘క్లోజప్‌లో నా ఫోటోలు చూడటానికి విచిత్రంగా ఉన్నప్పటికి చాలా బాగుంది అంటూ’ చమత్కరించారు. -
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ .. ఆణుబాంబు తయారీతో సమానం!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌జీపీటీ వినియోగంపై ప్రపంచ దిగ్గజ పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐని సృష్టించడం అంటే అణు బాంబును తయారు చేయడంతో సమానమని అన్నారు. దీంతో కృత్తిమ మేధస్సు వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రముఖుల్లో వారెన్ బఫెట్ చేరిపోయారు. చాట్‌జీపీటీ టూల్స్ వినియోగం వల్ల మానవ మనుగడుకు ప్రశ్నార్ధకంగా మారుతుందని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. ఏఐని నిలిపివేయాలని లేఖలు సైతం రాశారు. తాజాగా ఎలాన్ మస్క్ వ్యాఖ్యలకు ఊతం ఇచ్చేలా వారెన్ బఫెట్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం చర్చాంశనీయంగా మారింది. చదవండి👉 ‘ఆఫీస్‌కి వస్తారా.. లేదంటే!’, వర్క్ ప్రమ్ హోం ఉద్యోగులకు దిగ్గజ టెక్ కంపెనీల వార్నింగ్ నెబ్రాస్కాలోని ఒమాహాలో జరిగిన బెర్క్‌షైర్ హాత్వే వార్షిక సమావేశంలో చర్చ సందర్భంగా వారెన్ బఫెట్.. ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని అణు బాంబుతో పోల్చారు. ఈ అంశాన్ని న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. కొంతకాలం క్రితం ప్రముఖ బిలియనీర్, తన స్నేహితుడు బిల్ గేట్స్ చాట్‌జీపీటీ గురించి చెప్పినప్పుడు..దాని సామార్ధ్యాలకు గురించి తెలుసుకొని ఆశ్చర్య పోయా. కానీ, సాంకేతికతపై తాను కొంచెం భయపడుతున్నానని చెప్పారు. అన్ని రకాల పనులు ఒక్కరే చేయగలిగే శక్తి సామర్ధ్యాలు ఉన్నప్పుడు మనం మిగిలిన పనుల్ని చేయలేం. కొత్తగా సృష్టించలేం. మనం చేసే పని మంచిదై ఉండొచ్చు. కానీ అందులోనూ కొన్ని దుష్ప్రయోజనాలు ఉన్నాయి. అందుకు సరికొత్త నిర్వచనమే అణుబాంబు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అణుబాంబు ప్రయోగం రుజువు చేసిందని గుర్తు చేశారు. మనం ఏం చేసినా.. ఏది కనిపెట్టినా 200 ఏండ్ల తర్వాత ప్రపంచానికి మేలు చేసేలా ఉండాలి. ప్రపంచం మొత్తాన్ని ఏఐ మార్చేస్తుందని నమ్ముతున్నట్లు చెప్పిన ఆయన ఏ టెక్నాలజీ మానవ మేధస్సు కంటే మెరుగ్గా ఆలోచిస్తాయనని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశారు. చదవండి👉 ఈ చెట్టు లేకపోతే ప్రపంచంలో కూల్‌డ్రింక్స్ తయారీ కంపెనీల పరిస్థితి ఏంటో? -
మహీంద్రా ఇ-రిక్షా నడిపిన బిల్ గేట్స్ వీడియో వైరల్, ఆనంద్ మహీంద్ర స్పందన
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు, బిలియనీర్ బిల్ గేట్స్ భారత పర్యటనలో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తనకెదురైన కొత్త కొత్త అనుభవాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇటీవల కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కలిసి వంట చేస్తున్న వీడియో షేర్ చేయగా అది ఇంటర్నెట్లో వైరల్ అయింది. అలాగే తన క్లాస్ మేట్, వ్యాపారవేత్త ఆనంద్మహీంద్రాతో భేటీకావడం ప్రముఖంగా నిలిచింది. తాజాగా మహీంద్రా ట్రియో ఆల్-ఎలక్ట్రిక్ రిక్షాను నడుపుతున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. గ్రీన్ ఇన్నోవేషన్స్‌కు భారీ మద్దతిస్తే బిట్ గేట్స్ మహీంద్ర ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌పై ప్రశంసలు కురిపించారు. ‘బాబు సంజో ఇషారే’ నేపథ్య సంగీతంతో కూడిన పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో అందరినీ ఆకర్షిస్తోంది. మహీంద్రా వంటి కంపెనీలు రవాణా పరిశ్రమలో ఇ-రిక్షాలతో డీకార్బనైజేషన్‌కి దోహదం చేయడం స్ఫూర్తిదాయకంగా ఉందని కొనియాడారు. "గేట్స్ నోట్స్" అంటూ బిల్ గేట్స్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేసిన వీడియోలో ఇ-రిక్షాను ఆన్ చేసి,131కిమీ (సుమారు 81 మైళ్లు) వరకు ప్రయాణించే ఎలక్ట్రిక్ రిక్షాను నడిపా. నలుగురిని మోసుకెళ్లవచ్చు అంటూ తన స్పెషల్ డ్రైవింగ్ అనుభవాన్ని పంచుకున్నారు. వ్యవసాయం నుండి రవాణా వరకు కార్బన్ ఉద్గారాలు లేని ప్రపంచంకోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్బంగా ఆయన చెప్పుకొచ్చారు. కోవిడ్-19 తర్వాత బిల్ గేట్స్ ఇండియాకు రావడం ఇదే మొదటిది. View this post on Instagram A post shared by Bill Gates (@thisisbillgates) కాగా 2021 చివరలో లాంచ్ చేసిస మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్ ఆటో రిక్షా ధర రూ. 2.09 లక్షలు (ఎక్స్-షోరూమ్). 7.37 kWh సామర్థ్యంతో 48V లిథియం-అయాన్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు 3 గంటల 50 నిమిషాలు పడుతుంది. దీనికి గరిష్ట వేగం గంటకు 50కిమీ . ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 80కిలోమీటర్లు ప్రయాణించగలదు. రియర్, అండ్ ఫ్రంట్ హైడ్రాలిక్ బ్రేక్స్తోపాటు, అలాగే పార్కింగ్ కోసం మెకానికల్ లివర్ బ్రేక్ ఆప్షన్ కూడా ఉంది. ఆనంద్ మహీంద్ర స్పందన మరోవైపు బిల్ గేట్స్ పోస్ట్‌పై ఆనంద్‌మహీంద్ర కూడా స్పందించారు. "చల్తీ కా నామ్ బిల్ గేట్స్ కీ గాడి" అంటూ మహీంద్ర ట్రియోని చూడటానికి బిల్ గేట్స్‌కి సమయం దొరికినందుకు చాలా సంతోషం అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. అలాగే మీ నెక్ట్స్ ఎజెండాలో నాతోపాటు, మీరు సచిన్ తెందూల్కర్, ముగ్గురి మధ్య 3- వీలర్ ఈవీ డ్రాగ్ రేస్ ఉండేలా చూడండి అంటూ ఆయన పేర్కొనడం విశేషం. “Chalti ka Naam Bill Gates ki Gaadi” So glad you found the time to check out the Treo @BillGates Now on your next trip’s agenda should be a 3-wheeler EV drag race between you, @sachin_rt and me… pic.twitter.com/v0jNikYyQg — anand mahindra (@anandmahindra) March 6, 2023 -
బిల్‌గేట్స్ చిన్న కుమార్తెపై జాతి విద్వేష కామెంట్లు.. అసభ్య వ్యాఖ్యలు
కొద్ది రోజులుగా అమెరికాలో జాతి విద్వేష వేధింపులు పెరిగిపోతున్నాయి. తాజాగా అపర కుబేరుడు బిల్ గేట్స్, మిలిందా ఫ్రెంచ్ గేట్స్‌ల కుమార్తె ఫోబ్ గేట్స్‌కు సైతం ఆ వేధింపులు తప్పలేదు. ఇటీవలే ఆమె సామాజిక మాధ్యమాల్లో ఓ ఫొటోను షేర్ చేయటంతో జాతి విద్వేష వేధింపులకు గురయ్యారు. ఆ తర్వాత ఆ ఫోటోను డిలీట్ చేశారు ఫోబ్ గేట్స్. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ నల్లజాతి యువకుడు తన బుగ్గపై ముద్దు పెడుతున్న ఫొటోను షేర్ చేశారామె. దీంతో ఆ ఫోటోను ట్రోల్ చేస్తూ ఆమెపై జాతి విద్వేష వేధింపులకు పాల్పడ్డారు పలువురు నెటిజన్లు. ఇరువురిపై జోక్స్ పేల్చారు. 'ఈ సంబంధాన్ని అంతం చేయడానికి బిల్ గేట్స్ సరికొత్త వైరస్‌ని తయారు చేయబోతున్నారు. అసలే వాతావరణ సంక్షోభం విపరీతంగా పెరిగిపోయింది. ఈక్రమంలోనే బిల్‌గేట్స్ కుమార్తె బొగ్గును స్వీకరించేందుకు సిద్ధపడిందా' అంటూ ఓ నెటిజన్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడు. 'బిల్‌గేట్స్ తన కుమార్తెను తిరస్కరిస్తారా లేదా ప్రేమ అంటే కేవలం ప్రేమే అనే వాస్తవాన్ని ఒప్పుకుంటారో చూడాలి. ఒక వ్యక్తి వ్యతిరేకించేవారు.. వారి కుటుంబంలోకి రావటం హాస్యాస్పదంగా ఉంది. ఫోబ్ గేట్స్ కోసం ఇది జరుగుతుందని నమ్ముతున్నా. లవ్ లవ్' అంటూ మరో యూజర్ కామెంట్ చేశారు. You think the racist, republican extremist, Grifters/conspiracy theorist hated @BillGates before …..Wait till they get a load of Phoebe Gates life choices. pic.twitter.com/HPmEZ3tN6b — Popitics (@Popitics1) July 6, 2022 ఫోబ్ గేట్స్.. 2002, సెప్టెంబర్ 14న వాషింగ్టన్‌లోని బెల్లేవ్‌లో జన్మించారు. బిల్ గేట్స్, మిలిందా గేట్స్ దంపతుల ముగ్గురు పిల్లల్లో ఆమె చిన్న కూతురు. 2021, మే 4న బిల్ గేట్స్, మిలిందాలు తమ 27 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశారు. ట్విట్టర్ వేదికగా తమ విడాకుల విషయాన్ని ఇరువురు తెలిపారు. -
ఐటీ@ వైఎస్
* వైఎస్ హయాంలోనే అసలైన అభివృద్ధి * ‘బాబు’దంతా గోబెల్స్ ప్రచారమే * 2004 తరువాతే ఐటీ ఎగుమతుల్లో గణనీయ వృద్ధి * గణాంకాలు చెప్పే వాస్తవం ఇదే స్వాతి: ఐటీ సృష్టికర్త నేనేనంటాడు.. మీకందరకీ ఉద్యోగాలు నా పుణ్యమేనంటాడు.. హైదరాబాద్‌లో ఐటీ కళ నా పుణ్యమేనంటాడు.. బిల్‌గేట్స్, బిల్ క్లింటన్ల పేర్లు వల్లె వేస్తుంటాడు.. వైఎస్ ఐటీనసలే పట్టించుకోలేదంటాడు.. వైఎస్ హయాంలో ఐటీ రంగ ఎగుమతులు కుంటుపడ్డాయంటాడు.. ఇవన్నీ నిజాలేనా?.. లేక చంద్రబాబు మార్కు ప్రచార ప్రధాన, ఊదరగొట్టు, ఊకదంపుడు గోబెల్స్ వాఖ్యలా?.. ఎవరి హయాంలో ఐటీ రంగం వాస్తవంగా ప్రగతిపథాన నడిచింది? ప్రచార ఆర్భాటం లేకుండా మిగతా రంగాలతో సమానంగా ఐటీకి ప్రాధాన్యత ఇచ్చిందెవరు?.. ఈ గణాంకాలు చూడండి.. వాస్తవాలు తెలుస్తాయి. ఐటీ పాలసీని ప్రభుత్వం 25-05-1999న ప్రకటించింది. దీనిని 27-06-2002న ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) పాలసీగా మార్చారు. ఆ తర్వాత ఐసీటీ విధానం (2005-2010) తేదీ 21-03-2005 నుండి అమలులోకి వచ్చింది. 1999లో ఐటీ రంగంలో 12 వేల ఉద్యోగాల కల్పన జరిగితే, 2009 నాటికి అది 20 రెట్లు పెరిగి 2,51,786కు చేరింది. 1999లో రూ.284 కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతుల టర్నోవర్ 2009 నాటికి రూ. 32, 509 కోట్లకు పెరిగింది. - చంద్రబాబు హయాంతో పోల్చితే వైఎస్ హయాంలో 110 రెట్లు ఐటీ ఎగుమతులు పెరిగాయి. - 2003-04లో రూ. 5025 కోట్ల రూపాయలు విలువజేసే ఐటీ ఎగుమతులు మాత్రం ఉండేవి. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు హైటెక్ సీఎం అన్న పేరు ఉన్నప్పటికీ నిజానికి వైఎస్ హయాంలోనే ఐటీ అద్భుతమైన ప్రగతిని సాధించినట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. - 2003లో ఐటీ రంగం ద్వారా 71,445 మందికి ఉద్యోగాలు కల్పిస్తే 2009లో ఇది 2,51,786కు పెరిగింది. - ఐటీ రంగం ప్రగతి వైఎస్ మరణానంతరం కుంటుపడింది. 2010-11లో ఐటీ ఉత్పత్తుల విలువ రూ.36వేల కోట్లే. - ఐటీ అభివృద్ధి తనవల్లే జరిగిందని చెప్పే చంద్ర బాబు పాలనకు ముందే 1987లోనే హైదరాబాద్‌లో సత్యం కంప్యూటర్ సర్వీసెస్ ఏర్పడింది. చంద్రబాబు ఐటీ అభివృద్ధికి ఆద్యుడు కాదన్న విషయం దీన్నిబట్టే అర్థమవుతుంది. - ప్రపంచపటంలో హైదరాబాద్‌కు చోటు కల్పించానని చెప్పుకునే చంద్రబాబుది కేవలం ప్రచార పటాటోపం మాత్రమే. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ఐటీ రంగంలో 81 వేల ఉద్యోగాలు కల్పిస్తే, వైఎస్ఆర్ పాలనలో కొత్తగా 1.53 లక్షల ఉద్యోగాలు కల్పించడం జరిగింది. - భారత ఐటీ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాటా 15 శాతం. ఐటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిది దేశంలో నాలుగో స్థానం. - ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్(ఐటీఐఆర్)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్టానికి సూత్రప్రాయమైన తుది ఆమోదం తెలిపింది. దీంతో వచ్చే 25 ఏళ్లలో 50 వేల ఎకరాల్లో రెండు దశల్లో ఐటీఐఆర్‌ను అభివృద్ధి చేస్తారు. దీనికి రూ. 2.19 లక్షల కోట్లు ఖర్చు చేస్తారు. 15 లక్షల మందికి దీని వల్ల ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. ఐటీఐఆర్‌లో సెజ్‌లు, ఇండస్ట్రియల్ పార్కులు, ఫ్రీ ట్రేడ్ జోన్లు, వేర్ హౌజింగ్ జోన్లు, ఎగుమతి సంస్థలు ఉంటాయి. - ఐటీఐఆర్ ఏర్పాటులో హైదరాబాద్‌కే తొలి అవకాశం లభించింది. ఐటీఐఆర్‌తో ప్రస్తుతం ఉన్న 50వేల కోట్ల ఎగుమ తులను 2.35 లక్షల కోట్లకు పెంచడమే ప్రభుత్వ లక్ష్యం. ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ ఉత్పత్తుల రంగం ప్రస్తుతం ఉన్న రూ. 6 వేల కోట్ల నుంచి రూ. 80 వేల కోట్లకు వృద్ధి చెందుతుందని అంచనా. హైదరాబాద్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్‌లలో ఐటీ కంపెనీలు కేంద్రీకృతమయ్యాయి. ఇదంతా వైఎస్ తీసుకున్న చర్యల వల్ల సాధ్యమైంది. వైఎస్ ప్రభుత్వం ఎన్నడూ ఐటీ విషయంలో ప్రచారపటాటోపం ప్రదర్శించలేదు. ఐటీని రాష్ట్రంలో పరుగులు పెట్టించినా వైఎస్ రైతుజన బాంధవుడిగానే ఉండటానికి ఇష్టపడ్డారు. -
విశ్లేషణం: మనసున్న మేథావి
అతనేం పెద్దగా చదువుకోలేదు... కానీ గొప్పగా ఆలోచించాడు. ‘కిటికీల’తో సాంకేతిక సామ్రాజ్యాధిపతిగా నిలిచాడు. ప్రపంచంలో ఎవరూ సంపాదించలేనంత ధనాన్ని ఆర్జించాడు. సంపాదించడమే కాదు పంచడమూ తెలుసంటూ వేలకోట్ల రూపాయలు విరాళాలుగా ఇస్తున్నాడు. తానో హృదయమున్న మేధావినని నిరూపించుకున్నాడు. ఆయనే... మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్. మాటలు, చేతులు కలిసి జంటగా... గేట్స్ కాస్తంత తల పెకైత్తి, కాలు మీద కాలువేసుకుని ధారాళంగా, స్వేచ్ఛగా మాట్లాడతారు. ఇవన్నీ ఆయన మంచి భావనలున్న విజువల్ పర్సన్ అనీ, ఆత్మవిశ్వాసం మెండుగా ఉందనీ చెప్తాయి. ఆయన తన ఫీలింగ్స్‌ను ఎంతో కొంత నిగ్రహించుకుంటాడని పెదవులు దాటని నవ్వు చెప్తుంది. నిజాయితీగా మాట్లాడతాడని ఓపెన్‌గా చాచిన చేతులు వివరిస్తాయి. అయితే ఈ చేతుల కదలికలు సందర్భాన్ని బట్టి మారిపోతూంటాయి. అప్పుడప్పుడూ అథారిటేటివ్‌గా హస్తాలను కిందకు కూడా ఉంచుతాడు. ఎవరు మాట్లాడుతున్నా ఆయన శ్రద్ధగా వింటారు. కళ్లజోడు సవరించుకుంటున్నారంటే తానేదో చెప్పబోతున్నాడన్నమాట. అంతేకాదు గేట్స్ చేతులు కూడా మాటలతో జతకలిసి జంటగా కదులుతాయి. అంటే ఆయన మనసులో ఉన్నదే నిజాయితీగా చెప్తున్నాడని అర్థం. ఆలోచనాజీవి... బిల్‌గేట్స్ చిన్నప్పటినుంచీ ఆలోచనా జీవి. ఆరేళ్ల వయసులో గేట్స్‌ను తల్లి ఏం చేస్తున్నావ్? అని అడిగితే.. ఆలోచిస్తున్నాను అని చెప్పాడట. ఆవిడకు అర్థంకాక ‘ఏంటీ.. ఆలోచిస్తున్నావా?’ అని అడిగితే... ‘అవును, ఆలోచిస్తున్నాను, నువ్వెప్పుడైనా ఆ ప్రయత్నం చేశావా?’ అని అడిగాడట. బాల్యంనుంచే గేట్స్ ఆలోచించడానికి అత్యంత ప్రాధాన్యమిచ్చాడు కనుకనే నూనూగు మీసాల వయసులోనే విండోస్ సాఫ్ట్‌వేర్‌ను సృష్టించి, మైక్రోసాఫ్ట్ కంపెనీ స్థాపించి సాఫ్ట్వేర్ కింగ్‌గా నిలిచాడు. ఆలోచనలు మెరుపువేగంలో వినూత్నంగా, లక్ష్యం దిశగా సాగిపోవడమే అందుకు కారణం. ఆయన పుస్తకాల్లో ఒకదానికి ‘బిజినెస్ ఎట్ స్పీడ్ ఆఫ్ థాట్’ అని పెట్టడం కూడా కాకతాళీయమేమీ కాదు. బిల్గేట్స్ది ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్. తన తెలివితేటలు, ఆత్మవిశ్వాసం, కార్యసాధన, చురుకైన ఆలోచనాధోరణితో సహచరులను, అనుచరులను ప్రభావితం చేస్తాడు. తన విజన్‌ను అందరితోనూ పంచుకుంటాడు, అందరూ దానిలో భాగస్వాములై దాన్ని సఫలం చేయాలనుకుంటాడు. తాను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడంకోసం ఎన్ని గంటలైనా శ్రమిస్తాడు, దేనికైనా సిద్ధమవుతాడు. ఈ క్రమంలో తన ఉద్యోగులను అదిలించడంలో, విమర్శించడంలో ఏ మాత్రం వెనుకాడడు. అలాగే పోటీ సంస్థలను అధిగమించేందుకు కూడా. అయితే ఫౌండేషన్ స్థాపించాక ఆయన నాయకత్వ ధోరణిలో కొంత మార్పు వచ్చిందని చెప్పవచ్చు. ఫౌండేషన్ అకౌంట్లను భాగస్వాములందరికీ అందుబాటులో ఉంచడమే అందుకు ఉదాహరణ. మనసున్న మారాజు... బిల్‌గేట్స్ తెలివైనవాడు, మేధావి మాత్రమే కాదు... మనసున్న మారాజు కూడా. కాబట్టే ప్రపంచంలో పేదరికంతో, జబ్బుల బారిన పడి మరణిస్తున్న పిల్లలను చూసి చలించాడు. ఫౌండేషన్‌ను స్థాపించి అనేక దేశాల్లో బాలలకు వ్యాక్సిన్ అందిస్తున్నాడు. డబ్బు సంపాదించడం చాలామందికి తెలుసు, కానీ సంపాదించిన డబ్బును విరాళంగా ఇవ్వాలంటే గొప్ప మనసుండాలి. ఆ మంచి మనసు, స్పందించే హృదయం గేట్స్ సొంతం. సమాజంలో ప్రజలందరూ మెరుగైన జీవనాన్ని పొందినప్పుడే తన వ్యాపార విస్తరణ మరింతగా జరుగుతుందన్న స్వార్థం అందులో లేకపోలేదు. అయినా అది మంచి స్వార్థమే. కంప్యూటర్ రంగంలో విస్తృత పరిజ్ఞానం, విజన్, చిత్తశుద్ధి, పట్టుదల, పవర్, కరిష్మా గేట్స్ బలాలు కాగా... ఆధిప్యత ధోరణి, సమస్యల పరిష్కారానికి చొరవ చూపకపోవడం, లక్ష్యాలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఆయన బలహీనతలు. - విశేష్, సైకాలజిస్ట్