Trolls On Bill Gates Daughter Phoebe Gates With Racial Abuse Over Her Shared Photo - Sakshi
Sakshi News home page

బిల్‌గేట్స్‌ చిన్న కుమార్తె బుగ్గపై యువకుడి ముద్దు.. జాతి విద్వేష కామెంట్లతో రెచ్చిపోయిన నెటిజన్లు

Jul 9 2022 11:01 AM | Updated on Jul 9 2022 12:58 PM

Bill Gates Daughter Phoebe Gates Faces Racial Abuse for Sharing a Photo - Sakshi

సామాజిక మాధ్యమాల్లో ఓ ఫొటోను షేర్‌ చేయటం వల్ల జాతి విద్వేష వేధింపులకు గురయ్యారు బిల్‌గేట్స్‌ కుమార్తె ఫోబ్‌ గేట్స్‌. 

కొద్ది రోజులుగా అమెరికాలో జాతి విద్వేష వేధింపులు పెరిగిపోతున్నాయి. తాజాగా అపర కుబేరుడు బిల్‌ గేట్స్‌, మిలిందా ఫ్రెంచ్‌ గేట్స్‌ల కుమార్తె ఫోబ్‌ గేట్స్‌కు సైతం ఆ వేధింపులు తప్పలేదు. ఇటీవలే ఆమె సామాజిక మాధ్యమాల్లో ఓ ఫొటోను షేర్‌ చేయటంతో జాతి విద్వేష వేధింపులకు గురయ్యారు. ఆ తర్వాత ఆ ఫోటోను డిలీట్‌ చేశారు ఫోబ్‌ గేట్స్‌. 

తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ నల్లజాతి యువకుడు తన బుగ్గపై ముద్దు పెడుతున్న ఫొటోను షేర్‌ చేశారామె. దీంతో ఆ ఫోటోను ట్రోల్‌ చేస్తూ ఆమెపై జాతి విద్వేష వేధింపులకు పాల్పడ్డారు పలువురు నెటిజన్లు. ఇరువురిపై జోక్స్‌ పేల్చారు. 'ఈ సంబంధాన్ని అంతం చేయడానికి బిల్‌ గేట్స్‌ సరికొత్త వైరస్‌ని తయారు చేయబోతున్నారు. అసలే వాతావరణ సంక్షోభం విపరీతంగా పెరిగిపోయింది. ఈక్రమంలోనే బిల్‌గేట్స్‌ కుమార్తె బొగ్గును స్వీకరించేందుకు సిద్ధపడిందా' అంటూ ఓ నెటిజన్‌ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడు.

'బిల్‌గేట్స్‌ తన కుమార్తెను తిరస్కరిస్తారా లేదా ప్రేమ అంటే కేవలం ప్రేమే అనే వాస్తవాన్ని ఒప్పుకుంటారో చూడాలి. ఒక వ్యక్తి వ్యతిరేకించేవారు.. వారి కుటుంబంలోకి రావటం హాస్యాస్పదంగా ఉంది. ఫోబ్‌ గేట్స్‌ కోసం ఇది జరుగుతుందని నమ్ముతున్నా. లవ్‌ లవ్‌' అంటూ మరో యూజర్‌ కామెంట్‌ చేశారు. 

ఫోబ్‌ గేట్స్‌.. 2002, సెప్టెంబర్‌ 14న వాషింగ్టన్‌లోని బెల్లేవ్‌లో జన్మించారు. బిల్‌ గేట్స్‌, మిలిందా గేట్స్‌ దంపతుల ముగ్గురు పిల్లల్లో ఆమె చిన్న కూతురు. 2021, మే 4న బిల్‌ గేట్స్‌, మిలిందాలు తమ 27 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశారు. ట్విట్టర్‌ వేదికగా తమ విడాకుల విషయాన్ని ఇరువురు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement