racial attacks
-
అమెరికాలో కాల్పులు.. ముగ్గురు నల్లజాతీయులు మృతి
జాక్సన్‌విల్లె: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం జాక్సన్‌విల్లెలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న కాల్పుల ఘటన కలకలం రేపింది. ఎడ్వర్డ్ వాటర్స్ యూనివర్సిటీకి సమీపంలోని డాలర్ జనరల్ స్టోర్ వద్ద ఓ యువకుడు(20) జరిపిన కాల్పుల్లో ముగ్గురు నల్ల జాతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఇది జాతి విద్వేష ఘటన అని పోలీసులు తెలిపారు. అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకుని చనిపోయాడు. నిందితుడు నల్ల జాతీయులను ద్వేషించే వాడని, ఇతర గ్రూపులతో అతడికి సంబంధాలున్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు. అతడు హ్యాండ్గన్తోపాటు, సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌తో కాల్పులకు తెగబడ్డాడన్నారు. ఒక తుపాకీపై స్వస్తిక్ గుర్తు ఉందని వివరించారు. పొరుగునే ఉన్న క్లె కౌంటీ నుంచి నల్లజాతీయులు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతానికి వచ్చాడు. కాల్పులకు కొద్దిసేపటి ముందు తన తండ్రికి మెసేజీ పంపించాడని, దాని ప్రకారం నిందితుడి కంప్యూటర్ ఓపెన్ చేసి చూడగా విద్వేషపూరిత రాతలు కనిపించాయని పోలీసులు వివరించారు. -
బిల్‌గేట్స్ చిన్న కుమార్తెపై జాతి విద్వేష కామెంట్లు.. అసభ్య వ్యాఖ్యలు
కొద్ది రోజులుగా అమెరికాలో జాతి విద్వేష వేధింపులు పెరిగిపోతున్నాయి. తాజాగా అపర కుబేరుడు బిల్ గేట్స్, మిలిందా ఫ్రెంచ్ గేట్స్‌ల కుమార్తె ఫోబ్ గేట్స్‌కు సైతం ఆ వేధింపులు తప్పలేదు. ఇటీవలే ఆమె సామాజిక మాధ్యమాల్లో ఓ ఫొటోను షేర్ చేయటంతో జాతి విద్వేష వేధింపులకు గురయ్యారు. ఆ తర్వాత ఆ ఫోటోను డిలీట్ చేశారు ఫోబ్ గేట్స్. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ నల్లజాతి యువకుడు తన బుగ్గపై ముద్దు పెడుతున్న ఫొటోను షేర్ చేశారామె. దీంతో ఆ ఫోటోను ట్రోల్ చేస్తూ ఆమెపై జాతి విద్వేష వేధింపులకు పాల్పడ్డారు పలువురు నెటిజన్లు. ఇరువురిపై జోక్స్ పేల్చారు. 'ఈ సంబంధాన్ని అంతం చేయడానికి బిల్ గేట్స్ సరికొత్త వైరస్‌ని తయారు చేయబోతున్నారు. అసలే వాతావరణ సంక్షోభం విపరీతంగా పెరిగిపోయింది. ఈక్రమంలోనే బిల్‌గేట్స్ కుమార్తె బొగ్గును స్వీకరించేందుకు సిద్ధపడిందా' అంటూ ఓ నెటిజన్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడు. 'బిల్‌గేట్స్ తన కుమార్తెను తిరస్కరిస్తారా లేదా ప్రేమ అంటే కేవలం ప్రేమే అనే వాస్తవాన్ని ఒప్పుకుంటారో చూడాలి. ఒక వ్యక్తి వ్యతిరేకించేవారు.. వారి కుటుంబంలోకి రావటం హాస్యాస్పదంగా ఉంది. ఫోబ్ గేట్స్ కోసం ఇది జరుగుతుందని నమ్ముతున్నా. లవ్ లవ్' అంటూ మరో యూజర్ కామెంట్ చేశారు. You think the racist, republican extremist, Grifters/conspiracy theorist hated @BillGates before …..Wait till they get a load of Phoebe Gates life choices. pic.twitter.com/HPmEZ3tN6b — Popitics (@Popitics1) July 6, 2022 ఫోబ్ గేట్స్.. 2002, సెప్టెంబర్ 14న వాషింగ్టన్‌లోని బెల్లేవ్‌లో జన్మించారు. బిల్ గేట్స్, మిలిందా గేట్స్ దంపతుల ముగ్గురు పిల్లల్లో ఆమె చిన్న కూతురు. 2021, మే 4న బిల్ గేట్స్, మిలిందాలు తమ 27 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశారు. ట్విట్టర్ వేదికగా తమ విడాకుల విషయాన్ని ఇరువురు తెలిపారు. -
ఇంకెవరూ దొరకలేదా అంటూ మాజీ లవర్‌ను!
ఓహియో: తన మాజీ ఫ్రెండ్ ఓ నల్లజాతి యువతితో చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో శ్వేతజాతి యువతి తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. నల్లజాతి యువతిపై జాతి విద్వేష వ్యాఖ్యలు చేస్తూ.. ఆ తతంగాన్ని తన మొబైల్లో రికార్డ్ చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. ఆ వివరాలిలా... ఓహియో స్టేట్ వర్సిటీకి చెందిన యువతి కేటలిన్ రస్ట్ ఇటీవలే తన ప్రియుడితో బ్రేకప్ చేసుకుంది. అయితే కొంత కాలం నుంచి అలీఘా మేసన్ అనే నల్లజాతి యువతితో కేటలిన్ ప్రియుడు సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తన మాజీ ప్రియుడు, మేసన్‌తో కలిసి డ్యాన్స్ చేయడాన్ని గుర్తించింది. దీనిపై ఆగ్రహం చెందిన కేటలిన్, మేసన్పై జాత్యహంకార దాడులు మొదలుపెట్టింది. నల్లజాతి వారితో నీకు సంబంధాలేంటి, నీకు ఇంకెవరూ దొరకలేదా అంటూ బాయ్ ఫ్రెండ్‌పై కూడా నోరు పారేసుకుంది. మేసన్‌తో అసభ్యంగా మాట్లాడుతూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ట్విటర్లో ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం కేటలిన్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. అతడు ఇప్పుడు నీ ప్రియుడు కాదన్న విషయం గుర్తుంచుకోవాలని, జాతి అంటూ కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని కొందరు హెచ్చరించారు. బాధితురాలు మేసన్ స్పందిస్తూ.. 'నాకు మద్ధతు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను. కేటలిన్ చేసింది తప్పే కానీ, ఆమె తన తప్పును తెలుసుకుంటే చాలు. ప్రతిరోజూ ఇలాంటి జాత్యహంకార దాడులు ఏదో ఓ చోట జరుగుతున్నాయి. వాటి విషయంలో కూడా బాధితులకు మీరు అండగా నిలవాలని' కోరారు. -
భారతీయుల భద్రతకు ప్రాధాన్యం: ఆస్ట్రేలియా
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో ప్రవాస భారతీయుడిపై జరిగిన విద్వేషపూరిత దాడిని ఆ దేశ హైకమిషన్ ఖండించింది. ఈ దాడి విచారకరమని, ఈ దాడిలో స్పల్పగాయలమైన భారతీయుడు ప్రస్తుతం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. భారతీయులు సహా ఆస్ట్రేలియాలో నివసించే ప్రతి ఒక్కరి రక్షణ, భద్రతకు తాము గొప్ప ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపింది. ప్రస్తుతం ఈ దాడిని తీవ్రంగా పరిగణించి టాస్మానియా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని, భారతీయుడిపై దాడి వెనుక జాత్యాహంకార కోణం ఉందా? లేక ఇతర కారణాలు ఉన్నాయా? అన్నది విచారణలో వెలుగులోకి వస్తుందని పేర్కొంది. కేరళ కొట్టాయంకు చెందిన లీ మ్యాక్స్ జాయ్ అనే యువకుడిపై టాస్మానియాలోని హోబర్ట్‌లో ఐదుగురు దాడి చేసిన సంగతి తెలిసిందే. లీ మ్యాక్స్ నర్సింగ్ కోర్సు చేస్తూ ట్యాక్సీ డ్రైవర్‌గా పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. అతను హోబర్ట్‌లోని మెక్ డొనాల్డ్ రెస్టారెంట్‌కు కాఫీ తాగేందుకు వెళ్లాడు. అప్పటికే రెస్టారెంట్లో ఉన్న ఓ మహిళ సహా ఐదుగురు అక్కడి సిబ్బందితో గొడవ పడుతున్నారు. గొడవ పడొద్దని మ్యాక్స్ జాయ్ వారికి సూచించాడు. తీవ్ర ఆవేశానికి లోనైన వారు.. మ్యాక్స్ జాయ్‌తో గొడవకు దిగారు. 'బ్లడీ బ్లాక్ ఇండియన్స్' అంటూ అతడిపై నోరు పారేసుకున్నారు. రెస్టారెంట్లో ఉన్న మరికొందరు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపే దుండగులు మ్యాక్స్‌ను తీవ్రంగా గాయపరిచి పారిపోయారు. రాయల్ హోబర్ట్ హాస్పిటల్‌కు తరలించి అతడికి చికిత్స అందించారు. -
భారతీయుడిని రక్తం వచ్చేలా కొట్టారు!
-
భారతీయుడిని రక్తం వచ్చేలా కొట్టారు!
సిడ్నీ: ఆస్ట్రేలియాలో కొందరు దుండగులు ప్రవాస భారతీయుడిని జాతి వివక్షతో దూషించి, రక్తం వచ్చేలా దాడి చేశారు. హోబర్ట్‌లోని ఓ రెస్టారెంట్లో ఈ జాతి విద్వేష చర్య జరిగింది. కేరళలోని కొట్టాయం జిల్లా పుత్తుప్పల్లికి చెందిన లీ మ్యాక్స్ జాయ్ అనే యువకుడు నర్సింగ్ కోర్సు చేస్తూ ట్యాక్సీ డ్రైవర్‌గా పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. అతను మెక్ డొనాల్డ్ రెస్టారెంట్‌కు కాఫీ తాగేందుకు వెళ్లాడు. అప్పటికే రెస్టారెంట్లో ఉన్న ఓ మహిళ సహా ఐదుగురు అక్కడి సిబ్బందితో గొడవ పడుతున్నారు. గొడవ పడొద్దని మ్యాక్స్ జాయ్ వారికి సూచించాడు. తీవ్ర ఆవేశానికి లోనైన మహిళ సహా ఐదుగురు వ్యక్తులు మ్యాక్స్ జాయ్‌తో గొడవకు దిగారు. 'బ్లడీ బ్లాక్ ఇండియన్స్' అంటూ అతడిపై నోరు పారేసుకున్నారు. రెస్టారెంట్లో ఉన్న మరికొందరు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపే దుండగులు మ్యాక్స్‌ను తీవ్రంగా గాయపరిచి పారిపోయారు. రాయల్ హోబర్ట్ హాస్పిటల్‌కు తరలించి అతడికి చికిత్స అందించారు. కారు పార్కింగ్‌లో తొలుత గొడవపడ్డారని, ఆపై రెస్టారెంట్లో ఆ కోపాన్ని తనపై ప్రదర్శించారని బాధితుడు మ్యాక్స్ తెలిపాడు. ఆస్ట్రేలియాలో జాతి విద్వేష దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, ఈ విషయంలో విదేశాంగ మంత్రి జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. తనకు న్యాయం చేసేందుకు పోలీసులుగానీ, అధికారలు గానీ ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని ఆరోపించాడు. కొట్టాయం ఎంపీ జోస్ కె మణి ఈ జాతి విద్వేష దాడిని తీవ్రంగా ఖండించారు. విదేశాంగ మంత్రిని కలుసుకుని సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. -
జాతి విద్వేషం: అమెరికా బుడ్డోడి ధీటైన జవాబు!
వాషింగ్టన్: అమెరికాలో జాతి విద్వేష దాడుల నేపథ్యంలో విదేశీయులు బిక్కుబిక్కు మంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఐదేళ్ల అమెరికన్ బుడ్డోడు తన ఆలోచనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. జాత్యహంకార దాడులకు పాల్పడే వారు ఈ బాలుడు పోస్ట్ చేసిన ఫేస్ బుక్ వీడియో చూసి ఎంతో సిగ్గుపడాలి. ఆ వివరాలిలా ఉన్నాయి.. అమెరికాలోని కెంటూకీకి చెందిన శ్వేతజాతి బాలుడు జాక్స్(5) తన ఫ్రెండ్ నల్లజాతి బాలుడు రెడ్డి గిగిల్(5)కు మద్థతుగా నిలవాలని భావించాడు. అనుకున్నదే తడవుగా తన తల్లితో మాట్లాడి ఫ్రెండ్ రెడ్డి గిగిల్ లాగా కటింగ్ (హెయిర్ కట్) చేయించుకున్నాడు. అంతకుముందు స్పైక్స్ తో మంచి హెయిర్ స్టెయిల్ తో ఉండే జాక్స్ ను చూసి టీచర్లు షాకయ్యారు. విషయం అడిగితే.. తన ఫ్రెండ్ ను చూపిస్తూ ఇప్పుడు మేం ఇద్దరేం ఒకేలా ఉన్నామని.. మా మధ్య ఏ తేడా లేదు కదా అంటూ అడిగాడు. అప్పుడు నల్లజాతి బాలుడు రెడ్డి గిగిల్ సంతోషంగా జాక్స్ ను ఆలింగనం చేసుకుంటాడు. 'జాక్స్ అంటే నేనే.. ఐ యామ్ జాక్స్' అని మా ఇద్దరిలో ఎలాంటి మార్పులేదని రెడ్డి గిగిల్ అంటాడు. ఈ విషయాలను షూట్ చేసిన జాక్స్ తల్లి కుమారుడి కోరిక మేరకు ఈ వీడియోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. అందరూ ఒకటేనని చెప్పేందుకు తాను ఇలా హెయిర్ కట్ చేయించుకున్నానని జాక్స్ చెప్పాడు. జాతి విద్వేష దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారు బుడ్డోడు జాక్స్ ను అభినందిస్తున్నారు. ఆ బాబును చూసయినా కొందరు బుద్ధి తెచ్చుకోవాలని, ఇలాంటి దాడులకు జాక్స్ ధీటైన జవాబిచ్చాడంటూ కామెంట్ చేస్తున్నారు. -
బాధితులకు అండగా ఉంటాం: కేటీఆర్
హైదరాబాద్: అమెరికాలో తెలుగువారిపై జరిగిన దాడులపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కే తారకరామారావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వంశీ, శ్రీనివాస్, అలోక్‌ల కుటుంబాలకు ట్విట్టర్ వేదికగా తన సానుభూతి తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. దాడులపై విదేశాంగ శాఖతో చర్చిస్తామని తెలిపారు. కన్సాస్ రాష్ట్రం ఒలాతేలో బుధవారం రాత్రి ఓ బార్లో జాతి విద్వేషంతో అమెరికన్ జరిపిన కాల్పుల్లో ఇంజనీర్లు శ్రీనివాస్ కూచిబొట్ల ప్రాణాలు కోల్పోగా, అలోక్‌కు గాయాలయ్యాయి. వీరిద్దరూ గార్నిమ్ కంపెనీలో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. జేఎన్టీయూలో డిగ్రీ చదివిన శ్రీనివాస్ అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. (చదవండి: అమెరికాలో జాతి విద్వేష కాల్పులు) గత 15 రోజుల్లో అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు తెలుగు వారు మృతి చెందారు. ఈ నెల 12న కాలిఫోర్నియాలో వరంగల్‌కు చెందిన వంశీరెడ్డి ఓ యువతిని కాపాడబోయే ప్రయత్నంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. Shocked & anguished by the spate of attacks in US. Vamshi last month, Srinivas & Alok now. Will work with MEA to offer support to distressed — KTR (@KTRTRS) February 25, 2017 -
జాతి వివక్షకు 'అధికారం' తోడైతే..
- ట్రంప్ వచ్చాక అమెరికాలో పెరిగిపోతున్న జాతి వివక్ష దాడులు - ఇప్పటిదాకా ఏకంగా 1,094 ఘటనలు - అత్యధికం యూనివర్సిటీ క్యాంపస్‌లలోనే.. - భారతీయ విద్యార్థులకు కరువవుతున్న భద్రత ‘మా దేశం నుంచి వెళ్లిపొండి...’ తెలుగు ఇంజనీర్ కూచిబొట్ల శ్రీనివాస్‌ను కాల్చి చంపుతూ దుండగుడు అడమ్ పూరింటన్ గట్టిగా అరుస్తూ అన్న మాటలివి! వీటిలో అతడి నరనరాన జీర్ణించుకుపోయిన జాతి వివక్ష ధ్వనిస్తోంది. ‘అమెరికా మాది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి మా ఉద్యోగాలను కొల్లగొడుతున్నారు. మా పొట్ట కొడుతున్నారు. విదేశీయులకు ఇక్కడ స్థానం లేదు. వెళ్లిపోవాల్సిందే...’ అన్నది ఇలాంటి వారి ఆక్రోశం. శ్వేత జాత్యహంకార భావజాలం. అయితే ఇది ఏ కొద్దిమందికో పరిమితమైంది కాదు. శ్వేత జాతీయుల్లో అంతర్లీనంగా విస్తరించి.. బలపడుతోంది. అందుకే ‘ఫస్ట్ అమెరికా...’ అన్న డొనాల్డ్ ట్రంప్ వీరికి నచ్చాడు. విద్వేషపూరిత భావజాలమున్న వారిని ట్రంప్ తన బృందంలో చేర్చుకోవడంతో.. అధికారంపై ఈ అతివాదుల పట్టు బిగుస్తోంది. భవిష్యత్తులో ద్వేషపూరిత దాడులు మరింత తీవ్రమవుతాయేమోననే భయాన్ని రేకెత్తిస్తోంది. ఈ భయం సహేతుకమే అని చెప్పడానికి తగిన ఆధారాలూ ఉన్నాయి. ట్రంప్ వచ్చాక ఇదీ పరిస్థితి.. ట్రంప్ గెలుపు ఖాయమైన రోజు(నవంబర్ 9) నుంచి తీసుకుంటే.. మొత్తం 1,094 ద్వేషపూరిత ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందులో దూషణలు మొదలుకుని దాడులు చేయడం, కాల్పులకు తెగబడటం దాకా అన్నిరకాల విద్వేషపూరిత ఘటన లున్నాయి. మత, జాతి వివక్ష, వలస జీవులపై వ్యతిరేకత, స్వలింగసంపర్కులపై ఏహ్యభావం, మహిళల పట్ల చులకన భావం వంటివి ఎన్నో రకాల ద్వేషపూరిత దాడులున్నాయి. సదరన్ పావర్టీ లా సెంటర్ ఇలాంటి ఘటనలను నమోదు చేస్తుంది. ఇందులో వలసలపై వ్యతిరేకతతో జరిగిన ఘటనలే 315. తర్వాతి స్థానం జాతి వివక్షది. నల్ల జాతీయులపై దాడులు, దూషణలకు దిగిన ఘటనలు 221. న్యూయార్క్ పోలీసు విభాగానికి చెందిన డిటెక్టివ్స్ చీఫ్ రాబర్ట్ బోయెస్ కూడా ద్వేషపూరిత దాడులు 115% పెరిగాయని(ట్రంప్ గెలిచాక) అంగీకరించారు. అంతకుముందు అమెరికావ్యాప్తంగా తీసుకున్నా ఇలాంటి ఘటనలు రెండంకెలకు మించలేదు. ట్రంప్ గెలిచిన రోజున ఏకంగా 200 పైగా ఘటనలు నమోదయ్యాయి. ద్వేషపూరిత దాడుల్లో చాలావాటిలో దుండగులు ట్రంప్ పేరును వాడటం.. ‘మా వాడొచ్చాడు, మీకిక మూడినట్లే..’ అని అనడం శ్వేతజాత్యహంకారుల్లో బలపడిన నమ్మకాన్ని రుజువు చేస్తోందని విశ్లేషకుల అభిప్రాయం. శ్వేతసౌధంలో అతివాదులు... ట్రంప్ ఎన్నిక... రాజకీయాల్లో అతివాదులకు మార్గం సుగమం చేసింది. స్వలింగ సంపర్కాన్ని గట్టిగా వ్యతిరేకించే కెన్నెత్ బ్లాక్వెల్ను అధికార మార్పిడి బృందానికి సారథిగా ట్రంప్ నియమించారు. ఇస్లాంను ‘భయంకరమైన క్యాన్సర్’గా పోల్చిన, ముస్లింలను చూసి భయపడటం సహేతుకమేనన్న మైక్ ఫ్లిన్‌ను జాతీయ భద్రతా సలహాదారుగా నియమించారు (ఈయన కొద్దిరోజులకే వివాదంలో ఇరుక్కొన్ని పదవిని పోగొట్టుకున్నారు). ముస్లింలను తీవ్రంగా వ్యతిరేకించే సంస్థలతో సన్నిహిత సంబంధాలున్న మైక్ పాంపియోను సీఐఏ డైరెక్టర్‌గా ట్రంప్ ఎంచుకున్నారు. వీటన్నింటి కంటే ముఖ్యమైనది... చీఫ్ స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా స్టీఫెన్ బానన్‌ను నియమించడం. అందరికంటే శ్వేతజాతి గొప్పదని, అమెరికా వాళ్లకే చెందినదనే భావజాలాన్ని ప్రచారం చేసే ‘బ్రీయిట్బార్ట్’ వెబ్‌సైట్‌కు బానన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పనిచేశారు. తీవ్ర జాత్యహంకార భావజాలమున్న వ్యక్తి. తాను అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ద్వేషపూరిత దాడులు పెరిగాయనే వార్తలు రావడంతో ‘వాటిని ఆపండి’ అంటూ ట్రంప్ ఖండించారు. అయితే అధ్యక్షుడికి కనులు, చెవులుగా స్టీఫెన్ బానన్ లాంటి వ్యక్తి శ్వేతసౌధంలో ఉండగా... ఈ శక్తులు తగ్గుతాయా అనేదే ప్రశ్న. ఆజ్యం పోస్తున్న ట్రంప్ మాటలు...చేతలు నేషనల్ పాలసీ ఇనిస్టిట్యూట్ అనే సంస్థ ద్వారా శ్వేత జాత్యహంకార భావజాలాన్ని రిచర్డ్ స్పెన్సర్ లాంటి అతివాదులు ప్రచారం చేస్తున్నప్పటికీ... వీరికి ట్రంప్ రూపంలో పెద్ద అండ కనబడింది. కాబట్టే ఈ భావజాలంతో ఉన్న గ్రూపులు, సంస్థలు ట్రంప్ విజయానికి శాయశక్తులా దోహదపడ్డాయి. ‘ఐడెంటిటీ ఎవ్రోపా’ అనే కాలిఫోర్నియా కేంద్రంగా ఉన్న క్యాంపస్ గ్రూపు, ది రైట్ స్టఫ్, అమెరికన్ వాన్గార్డ్ అనే సంస్థలు ఇంటర్నెట్ కార్యక్షేత్రంగా ట్రంప్‌కు అనుకూలంగా విస్తృత ప్రచారం చేశాయి. ద్వేషపూరిత భావజాలాన్ని వ్యాప్తి చేసే సైట్లలో నంబర్ వన్‌గా ఉన్న ‘డైలీ స్ట్రోమర్’ ట్రంప్‌ను మోసింది. ‘అమెరికాను మళ్లీ గొప్పదేశంగా నిలబెడదాం’ అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన ట్రంప్ ప్రచారపర్వం ఆద్యంతం వ్యతిరేక భావజాలాన్నే రెచ్చగొట్టారు. మెక్సికన్లను రేపిస్టులు, డ్రగ్ డీలర్లుగా అభివర్ణిస్తూ... వలసలను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో గోడ కడతానని వాగ్దానం చేశారు. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే అన్నారు. ముస్లింలు అమెరికాలోకి అడుగుపెట్టకుండా అడ్డుకుంటామన్నారు. అన్నట్లుగానే ఏడు ముస్లిం ఆధిక్య దేశాల నుంచి వచ్చేవారిని అమెరికాలోకి రానీయకుండా నిషేధాజ్ఞలు జారీచేశారు. కోర్టులు దీన్ని కొట్టివేసినా.. దానిపై ముందుకే వెళుతున్నారు. హెచ్1–బీ వీసాలపై ఆంక్షలు పెట్టడం ద్వారా వలసలను అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న వారిని స్వదేశానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. వీటన్నింటిని కారణంగా... జాత్యహంకార భావజాలమున్న వ్యక్తులు, సంస్థలు ట్రంప్ రూపంలో తమకో అండ ఉందనే భరోసాతో రెచ్చిపోతున్నారు. ఆర్థిక అసమానతలు కూడా అమెరికన్లలో అసంతృప్తిని పెంచి అతివాదం వైపు మొగ్గేలా చేస్తున్నాయి. క్యాంపస్‌లలో భద్రత ఏది? ఈ ఘటనల్లో ఏకంగా 74% యూనివర్సిటీ క్యాంపస్‌లలోనే చోటుచేసుకున్నాయని ఎస్‌పీఎల్‌సీ సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. అమెరికన్ వర్సిటీల్లో దాదాపు లక్షా 65 వేల మంది భారతీయులు చదువుతున్నారు. వీరిలో తెలుగు విద్యార్థులు గణనీయంగా ఉంటారు. ఇది మనకు ఆందోళన కలిగించే విషయం. భారత విద్యార్థుల భద్రతపై భయాలను పెంచుతోంది. పెరుగుతున్న వలసలు... విదేశాల్లో జన్మించిన అమెరికా పౌరులు 1970లో ఆ దేశ జనాభాలో 4.7 శాతం ఉండగా... 2015లో ఇది ఏకంగా 13.7 శాతం. వలసలు పెరిగిన తీరుకు ఇది అద్దం పడుతుంది. అలాగే అమెరికా జనాభాలో శ్వేత జాతీయుల (మెక్సికో, లాటిన్ అమెరికా మూలాలున్న వారు కాకుండా) శాతం 1960ల దాకా 90 ఉండేది. ఇప్పుడిది 62 శాతానికి పడిపోయింది. 2043 కల్లా ఇది జనాభాలో వీరి శాతం 50 లోపునకు పడిపోతుందని సెన్సెస్ బ్యూరో అంచనా. పెరుగుతున్న గ్రూపులు ద్వేషపూరిత భావజాలాన్ని ప్రచారం చేసే సంస్థలు, గ్రూపులు 1999లో 457 ఉండగా 2016 కల్లా ఇవి రెట్టింపయ్యాయి. 917 గ్రూపులు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. ఉగ్రదాడులు, ముస్లింలు కాల్పులకు తెగబడి పదుల సంఖ్యలో జనాలను చంపడం లాంటి ఘటనలతో ముస్లిం వ్యతిరేకతను ప్రచారం చేసే గ్రూపులు ఒక్క ఏడాదిలోనే అనూహ్యంగా పెరిగిపోయాయి. 2015లో 34 ముస్లిం వ్యతిరేక గ్రూపులుంటే 2016 కల్లా వీటి సంఖ్య 101కి చేరింది. - సాక్షి నాలెడ్జ్ సెంటర్