భారతీయుల భద్రతకు ​ప్రాధాన్యం: ఆస్ట్రేలియా | We place great importance on safety | Sakshi
Sakshi News home page

భారతీయుడిపై విద్వేష దాడి.. ఆస్ట్రేలియా స్పందన!

Published Mon, Mar 27 2017 3:34 PM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM

భారతీయుల భద్రతకు ​ప్రాధాన్యం: ఆస్ట్రేలియా

భారతీయుల భద్రతకు ​ప్రాధాన్యం: ఆస్ట్రేలియా

న్యూఢిల్లీ‌: ఆస్ట్రేలియాలో ప్రవాస భారతీయుడిపై జరిగిన విద్వేషపూరిత దాడిని ఆ దేశ హైకమిషన్‌ ఖండించింది. ఈ దాడి విచారకరమని, ఈ దాడిలో స్పల్పగాయలమైన భారతీయుడు ప్రస్తుతం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని పేర్కొంది. భారతీయులు సహా ఆస్ట్రేలియాలో నివసించే ప్రతి ఒక్కరి రక్షణ, భద్రతకు తాము గొప్ప ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపింది. ప్రస్తుతం ఈ దాడిని తీవ్రంగా పరిగణించి టాస్మానియా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని, భారతీయుడిపై దాడి వెనుక జాత్యాహంకార కోణం ఉందా? లేక ఇతర కారణాలు ఉన్నాయా? అన్నది విచారణలో వెలుగులోకి వస్తుందని పేర్కొంది.

కేరళ కొట్టాయంకు చెందిన లీ మ్యాక్స్ జాయ్ అనే యువకుడిపై టాస్మానియాలోని హోబర్ట్‌లో ఐదుగురు దాడి చేసిన సంగతి తెలిసిందే. లీ మ్యాక్స్‌ నర్సింగ్ కోర్సు చేస్తూ ట్యాక్సీ డ్రైవర్‌గా పార్ట్‌ టైమ్ జాబ్ చేస్తున్నాడు. అతను హోబర్ట్‌లోని మెక్ డొనాల్డ్ రెస్టారెంట్‌కు కాఫీ తాగేందుకు వెళ్లాడు. అప్పటికే రెస్టారెంట్‌లో ఉన్న ఓ మహిళ సహా ఐదుగురు అక్కడి సిబ్బందితో గొడవ పడుతున్నారు. గొడవ పడొద్దని మ్యాక్స్ జాయ్ వారికి సూచించాడు. తీవ్ర ఆవేశానికి లోనైన వారు.. మ్యాక్స్ జాయ్‌తో గొడవకు దిగారు. 'బ్లడీ బ్లాక్ ఇండియన్స్' అంటూ అతడిపై నోరు పారేసుకున్నారు. రెస్టారెంట్లో ఉన్న మరికొందరు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపే దుండగులు మ్యాక్స్‌ను తీవ్రంగా గాయపరిచి పారిపోయారు. రాయల్ హోబర్ట్ హాస్పిటల్‌కు తరలించి అతడికి చికిత్స అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement