ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది విండోస్ యూజర్స్ ఈరోజు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD) సమస్యను ఎదుర్కొన్నారు. ఇంతకీ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అంటే ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అంటే ఏమిటి
బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్‌ను.. బ్లూ స్క్రీన్ ఎర్రర్‌లు, బ్లాక్ స్క్రీన్ ఎర్రర్‌లు లేదా స్టాప్ కోడ్ ఎర్రర్‌లు అని కూడా పిలుస్తారు. సిస్టం అనుకోకుండా షట్ డౌన్ అయినప్పుడు లేదా రీస్టార్ట్ అయినప్పుడు ఇది జరుగుతుంది. అంటే కంప్యూటర్లకు ఎలాంటి నష్టం జరగకుండా ఉంటడానికి విండోస్ షట్ డౌన్ అవుతాయి. ఈ సమస్య హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్ కారణాల వల్ల కూడా జరిగే అవకాశం ఉంది.
విండోస్ బ్లూ స్క్రీన్ సమస్యను ఎలా పరిష్కరించాలి
విండోస్ బ్లూ స్క్రీన్ సమస్యను పరిష్కరించుకోవడానికి మైక్రోసాఫ్ట్ ఖచ్చితమైన మార్గ దర్శకాలను వెల్లడించలేదు. కానీ విండోస్‌లో గెట్ హెల్ప్ యాప్ ఓపెన్ చేయాలి. అక్కడ ట్రబుల్షూట్ బీఎస్ఓడీ ఎర్రర్ అని టైప్ చేయాలి. ఆ తరువాత మీకు కనిపించే సూచలనను అనుసరించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment