
పాము 'తలే' ప్రాణం తీసింది!
చైనా:పాము తలను మొండెం నుంచి వేరు చేశాడు. ఆ మాంసాన్ని వంటకు సిద్ధం చేశాడు. అయితే ఆ వేరు చేసిన తల ప్రాణంతోనే ఉన్నదన్న సంగతి మరిచాడు. అలా చేయడమే అతని ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ తాజా నమ్మశక్యం కాని ఘటన చైనాలోని ఫోషన్ నగరంలోని కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. ఒక చెఫ్ త్రాచు పామును మాంసాహారంగా చేయడం కోసం ఒక కత్తితో ఆ పాము తలను, మొండాన్ని వేరు చేశాడు.
ఇక వంటకు సిద్ధం అయ్యే క్రమంలో ప్రక్కనే ఉన్న పాము తలను చెత్తబుట్టలో పాడేయడానికి వెళ్లాడు. అయితే ఆ పాము తల మాత్రం అప్పటికీ ఊపిరితోనే ఉంది. అది ఆ చెఫ్ ను కాటువేయడంతో అతను కొద్దిపాటి సమయంలోనే ప్రాణాలు కోల్పోయాడు.ఇటువంటి ఘటనలు అరుదుగా జరిగినా.. పాము తలను వేరుచేసిన గంట తరువాత కూడా బ్రతికే ఉంటాయనేది ఇక్కడ గమనించాల్సిన విషయం.