'ఆ అమ్మాయే నా భార్యగా.. ఐయామ్ సో లక్కీ' | This Chef from Mumbai Will Give You Both Life and Marriage Goals | Sakshi
Sakshi News home page

'ఆ అమ్మాయే నా భార్యగా.. ఐయామ్ సో లక్కీ'

Published Wed, Sep 9 2015 11:13 AM | Last Updated on Sun, Sep 3 2017 9:04 AM

'ఆ అమ్మాయే నా భార్యగా.. ఐయామ్ సో లక్కీ'

'ఆ అమ్మాయే నా భార్యగా.. ఐయామ్ సో లక్కీ'

ముంబయి: నోట మాటరాదు. ఎవరేం చెప్పినా వినిపించదు.. పుట్టుకతో మూగ, చెవి లక్షణాలు. అయినా జీవిత కష్టాలను ఈది గెలిచాడు. నచ్చిన భాగస్వామిని సొంతం చేసుకోబోతున్నాడు. ఇది ముంబయిలోని ఓ యువకుడి కథ. హ్యూమన్స్ ఆఫ్ బొంబే పేరిట ఫేస్బుక్ పేజీలో తన అనుభవాలు పంచుకున్నాడు. తొలుత పలు అవకాశాలకోసం కాలు అరిగేలా తిరిగిన అతడు చివరికి ఓ కిచెన్లో పనిలో చేరాడు. అక్కడే అనుభవం సంపాధించి మంచి చెఫ్గా మారాడు. ఒక్కసారి అతడి మాటల్లోనే చూస్తే..

'నేనెప్పుడు వంటవాడిగానే ఉండేందుకు ఇష్టపడతాను. నేను వైకల్యంగలవాడిని కావడవంతో ఏ అవకాశాలు నాకు రాలేదు. పుట్టుకతో చెవుడు, మూగ లక్షణాలున్న నాకు ఎవరూ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. కానీ, ఎదుటివారు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. బదులు కూడా ఓ శబ్ధం ద్వారా ఇవ్వగలను. కానీ అది మీకు సరిగా అర్థం కాకపోవచ్చేమో. నా జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకం అంటే నా ప్రేమ.. కాబోయే భార్య'

'ఓసారి దాదర్ మార్కెట్కు వెళ్లిన నాకు ఓ అమ్మాయి కనిపించింది. తొలిచూపులోనే ప్రేమలో పడిపోయాను. కానీ ఒక్కసారి కూడా ఆమెతో మాట్లాడలేదు. కనీసం కలవలేదు. కానీ ఓ రోజు నా స్నేహితుడు వచ్చి నీకు ఒక అమ్మాయిని చూశానని చెప్పాడు. ఏం చేస్తాం ఏదో ఒక అమ్మాయిలే అనుకున్నాను. కానీ, ఆశ్చర్యపోయేలా నేను మార్కెట్లో ఏ అమ్మాయిని చూశానో అమ్మాయినే నా స్నేహితుడు నాకు భార్యగా తెచ్చాడు. ఆ సందర్భం ఎప్పటికీ మర్చిపోలేను. నేను చాలా అదృష్టవంతుడిని. ఆమెకు కూడా నాలాగా వినిపించదని తెలిసింది. దీంతో ఆమెపై నాకు మరింత ప్రేమ పెరిగింది. మేమిద్దరం దగ్గరవడానికి అది కూడా ఓ కారణం కావచ్చు. తొలిసారి కలుసుకున్నప్పుడు మాటలు చెప్పలేను. ఆమె నా ప్రేమను ఒప్పుకుంది. త్వరలో పెళ్లి చేసుకుంటాం' అని చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement