
సైఫ్...చెఫ్!
బాలీవుడ్ తెరపై హాలీవుడ్ కథలను రీమేక్ చేయడం ఎప్పటినుంచో వస్తున్నదే. హాలీవుడ్ ‘వారియర్’ను ‘బ్రదర్స్’గా ఇటీవలే తెర మీదకు తీసుకొచ్చింది హిందీ పరిశ్రమ. ఇప్పుడు మరో హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘చెఫ్’ని రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. స్వీయ దర్శకత్వంలో జాన్ ఫెవ్రూ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ఇది. సైఫ్ అలీఖాన్ హీరోగా ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి నిర్మాత విక్రమ్ మల్హోత్రా సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో సైఫ్ టైటిల్ రోల్ చేయనున్నారు. హిందీ నేటివిటీకి తగ్గట్టుగా ఈ కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారట.