మిస్టర్‌ చెఫ్‌ | 'Chef' first look: Saif Ali Khan is all set to cook up a storm | Sakshi
Sakshi News home page

మిస్టర్‌ చెఫ్‌

Published Wed, Jun 7 2017 11:25 PM | Last Updated on Tue, Sep 5 2017 1:03 PM

మిస్టర్‌ చెఫ్‌

మిస్టర్‌ చెఫ్‌

అతను స్టార్‌ హోటల్లో చెఫ్‌. అంటే వంట చేసే వ్యక్తి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లక్షల్లో జీతం. కలర్‌ఫుల్‌ జీవితం. ఇలాంటి హ్యాపీ లైఫ్‌ను ఎవ్వరూ వదులుకోరు.

అతను స్టార్‌ హోటల్లో చెఫ్‌. అంటే వంట చేసే వ్యక్తి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లక్షల్లో జీతం. కలర్‌ఫుల్‌ జీవితం. ఇలాంటి హ్యాపీ లైఫ్‌ను ఎవ్వరూ వదులుకోరు. కానీ ఈ మిస్టర్‌ చెఫ్‌ వదులుకుంటాడు. ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి రోడ్‌సైడ్‌ ఫుడ్‌ ట్రక్‌ను స్టార్ట్‌ చేస్తాడు. అందులోనూ అతను హ్యాపీలైఫ్‌ను ఎలా వెతుక్కున్నాడన్న అంశాలతో రూపొందిన హాలీవుడ్‌ చిత్రం ‘చెఫ్‌’. బాలీవుడ్‌ డైరెక్టర్‌ రాజా కృష్ణ మీనన్‌ ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. సైఫ్‌ ఆలీఖాన్‌ హీరోగా యాక్ట్‌ చేస్తున్నారు. పద్మప్రియ కథానాయిక. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ కనిపించనంత డిఫరెంట్‌గా సైఫ్‌ ఇందులో కనిపించనున్నారు. ఇక్కడ మీరు చూస్తున్న సైఫ్‌ ఫొటో సినిమాలోదే. చెఫ్‌ లుక్‌లో సైఫ్‌ సూపర్‌గా ఉన్నారు కదూ. ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement