మిస్టర్ చెఫ్
అతను స్టార్ హోటల్లో చెఫ్. అంటే వంట చేసే వ్యక్తి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లక్షల్లో జీతం. కలర్‌ఫుల్ జీవితం. ఇలాంటి హ్యాపీ లైఫ్‌ను ఎవ్వరూ వదులుకోరు. కానీ ఈ మిస్టర్ చెఫ్ వదులుకుంటాడు. ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి రోడ్‌సైడ్ ఫుడ్ ట్రక్‌ను స్టార్ట్ చేస్తాడు. అందులోనూ అతను హ్యాపీలైఫ్ను ఎలా వెతుక్కున్నాడన్న అంశాలతో రూపొందిన హాలీవుడ్ చిత్రం ‘చెఫ్’. బాలీవుడ్ డైరెక్టర్ రాజా కృష్ణ మీనన్ ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. సైఫ్ ఆలీఖాన్ హీరోగా యాక్ట్ చేస్తున్నారు. పద్మప్రియ కథానాయిక. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ కనిపించనంత డిఫరెంట్‌గా సైఫ్ ఇందులో కనిపించనున్నారు. ఇక్కడ మీరు చూస్తున్న సైఫ్ ఫొటో సినిమాలోదే. చెఫ్ లుక్‌లో సైఫ్ సూపర్‌గా ఉన్నారు కదూ. ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదల కానుంది.