
ముంబై: కొత్త ఏడాదికి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సరికొత్తగా ఆహ్వానం పలికాడు. తన ఫ్రెండ్స్ కోసం, ఫ్యామిలీ కోసం వంట చేసి న్యూ ఇయర్‌కు స్వాగతం పలికాడు. తాను చెఫ్‌గా అవతారమెత్తిన విషయాన్ని సచిన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.
'న్యూఇయర్ సందర్భంగా నా స్నేహితుల కోసం వంట చేయడం చాలా సంతోషంగా ఉంది. వాళ్లంతా నా వంటను ఎంతగానో ఆస్వాదించారు. మీరు కూడా ఇలాగే న్యూఇయర్ వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారని భావిస్తున్నాను. 2018 మీ అందరికీ ఎంతో సంతోషాన్ని కలుగచేయాలని కోరుకుంటున్నాను' అని సచిన్ విషెస్ తెలియజేశాడు.