ఒక హీరో భార్యగా తాను ఎంతో మానసిక వేదన అనుభవించానంటున్నారు ఆయుష్మాన్ ఖురానా భార్య తహీరా కశ్యప్. భర్త చుట్టూ అందమైన అమ్మాయిలు ఉంటే ఎవరైనా తనలాగే అభద్రతా భావంతో కుంగిపోతారని.. అయితే ఈ భావాలన్నీ తన మానసిక అపరిపక్వత కారణంగా కలిగినవేనని వ్యాఖ్యానించారు. బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన తహీరా త్వరలోనే ఓ ఫీచర్ ఫిల్మ్ ద్వారా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు.
ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తన భర్త మొదటి సినిమా నాటి అనుభవాల గురించి ప్రస్తావించారు. ‘చండీగఢ్ నుంచి ఆయుష్మాన్‌తో కలిసి ముంబై వచ్చిన కొత్తలో ఫలానా రంగంలో స్థిరపడాలని నేనెప్పుడూ అనుకోలేదు. రేడియో, టీవీ, టీచింగ్, పీఆర్ ఈవెంట్స్ ఇలా అన్నీ చేసాను. కానీ నాకు ఎందులోనూ సంతోషం దొరకలేదు. అయితే మొదటిసారి గర్భవతిని అయిన సందర్భంలో నేను పుట్టింటికి వెళ్లాను. ఆ సమయంలో ఆయుష్మాన్ విక్కీ డోనర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. నాతో కాసేపు మాట్లాడేందుకు కూడా తనకి సమయం ఉండేది కాదు. ఒకానొక సమయంలో తనకు విడాకులు ఇవ్వాలని కూడా అనుకున్నాను. నిజంగా అప్పుడు చాలా వేదన అనుభవించా. అది మా ఇద్దరి జీవితాల్లో అన్నికంటే కఠినమైన దశ అది. నా చేయి పట్టుకుని భయపడాల్సిందేమీ లేదని తను చెప్పినా బాగుండు. కానీ అప్పటికి ఇద్దరం మానసికంగా ఎదగలేదు. అందుకే చిన్న చిన్న తగాదాలు. తనతో బంధం తెంచుకోవాలన్నంత కోపం. కానీ తన గురించి నాకు, నా గురించి తనకి పూర్తిగా తెలుసు.అందుకే ప్రస్తుతం ఇలా ఉన్నాం’ అంటూ క్యాన్సర్‌తో ధీరోచితంగా పోరాడుతున్న తహీరా చెప్పుకొచ్చారు.
కాగా రియాలిటీ షోలు, టీవీ షోలు, రేడియో జాకీగా పని చేసిన ఆయుష్మాన్ ‘విక్కీ డోనర్’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది విడుదలైన అతడి సినిమాలు ‘అంధాధూన్, బదాయి హో’ సినిమాలు మంచి వసూళ్లు సాధించాయి. ఇక... 2008లో తహీరాను పెళ్లి చేసుకున్న ఈ స్టార్‌కి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment