హీనా ఖాన్‌ ధైర్యంగా ఉండు.. నువ్వో వారియర్‌వి: సమంత | Samantha Calls Hina Khan As A Warrior | Sakshi
Sakshi News home page

హీనా ఖాన్‌ ధైర్యంగా ఉండు.. నువ్వో వారియర్‌వి: సమంత

Published Tue, Jul 2 2024 5:25 PM | Last Updated on Tue, Jul 2 2024 5:59 PM

Samantha Calls Hina Khan As A Warrior

బాలీవుడ్‌ ప్రముఖ నటి హీనా ఖాన్‌ క్యాన్సర్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. తాను బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు స్వయంగా హీనా ఖానే ఓ వీడియోలో పేర్కొంది. దీంతో ఇండస్ట్రీలోని పెద్దలు ఆమెకు ధైర్యాన్ని అందిస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ సమంత కూడా హీనాఖాన్‌కు మానసిక ధైర్యాన్ని అందించింది.

(చదవండి: ప్రభాస్‌కి చాలా సిగ్గు.. టికెట్‌ కొనిచ్చి థియేటర్‌కి పంపాడు: హంసనందిని)

 ‘నీ కోసం నేను ప్రార్థిస్తున్నాను. ధైర్యంగా ఉండు’ అంటూ హీనా ఖాన్‌కి సంబంధించిన వీడియోను ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేస్తూ.. ‘వారియర్‌’ అనే హ్యాస్‌ ట్యాగ్‌ని జోడించింది. సమంత పోస్ట్‌కు హీనా రిప్లై ఇచ్చింది.  ‘సమంత మీరు అన్నిట్లోనూ స్టార్‌. జీవితంలో వచ్చే సవాళ్లను మీరు ఎదుర్కొనే తీరు అద్భుతం. మీ నుంచి నేను ఎంతో స్ఫూర్తి పొందాను. మీ ప్రేమ, ఆశీర్వచనాలకు ధన్యవాదాలు’ అని హీనా ఖాన్‌ రాసుకొచ్చింది.

కాగా, సమంత కూడా ఆ మధ్య అనారోగ్యం బారిన పడిన సంగతి తెలిసిందే. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడి.. ఇటీవల కోలుకుంది. తనకొచ్చిన వ్యాధిని దాచి పెట్టకుండా.. అందరికి తెలియజేసి..అవగాహన కలిపించింది. అంతేకాదు ఎంతో ధైర్యంగా ఉండి.. మంచి చికిత్స తీసుకోవడం కారణంగానే త్వరగా కోలుకుంది. సామ్‌ బాటలోనే హీనా ఖాన్‌ కూడా తనకొచ్చి వ్యాధి గురించి ధైర్యంగా బయటి ప్రపంచానికి తెలియజేసింది. మానసికంగా దృఢంగా ఉంటూ త్వరలోనే వ్యాధిని జయిస్తానని, ఈ కష్ట సమయంలో అందరు తోడుగా ఉండాలని కోరింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement