స్టార్‌ హీరో భార్యకు క్యాన్సర్‌ | Ayushmann Khurrana Wife Tahira Revealed She Diagnosed With Cancer Again | Sakshi
Sakshi News home page

స్టార్‌ హీరో భార్యకు క్యాన్సర్‌

Published Thu, Nov 29 2018 1:33 PM | Last Updated on Fri, Nov 30 2018 7:48 AM

Ayushmann Khurrana Wife Tahira Revealed She Diagnosed With Cancer Again - Sakshi

బాలీవుడ్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానా భార్య తహీరా కశ్యప్‌ తాను క్యాన్సర్‌తో బాధ పడుతున్నట్లు వెల్లడించారు. తనకు రొమ్ము క్యాన్సర్‌ సోకిందని, ప్రస్తుతం మొదటి దశలో ఉందని తహీరా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ ద్వారా రివీల్‌ చేశారు. అయితే ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కుంగిపోవాల్సిన పని లేదని, దయచేసి ఎవరూ ఆందోళన చెందవద్దని తన శ్రేయోభిలాషులను కోరారు.

మాట ఇస్తున్నా.. నాకేం కాదు!
‘ఇది నిజంగా చాలా కఠినమైన సమయమే. కానీ నేను ధైర్యం కోల్పోలేదు. నాలాగే చాలా మంది జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఉంటారు. ఒక్కోసారి ఏం చేయాలో అర్థం కాదు. మొదటిసారిగా టెస్టు చేయించుకున్నపుడు స్టేజ్‌ జీరో అని రిపోర్టు వచ్చింది. డాక్టర్‌ చెప్పినట్టుగా జాగ్రత్తలు తీసుకున్నా. కానీ ఇప్పుడు అప్‌గ్రేడెడ్‌ వర్షన్‌ వచ్చింది. మహమ్మారి ముదిరిపోయింది. స్టేజ్‌ 1లో ఉన్నా. ఇప్పటికి ఆరు సెషన్లు పూర్తయ్యాయి. ఇంకో ఆరు మిగిలి ఉన్నాయి. నేనెప్పటికీ ధైర్యం కోల్పోనని నా భర్త, స్నేహితులకు మాట ఇస్తున్నా. ఈ వార్త వినగానే మీరంతా షాకయ్యారని తెలుసు. మరేం పర్లేదు. మొదటి దశలోనే ఈ విషయం బయటపడింది’ అని తహీరా ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు.

కాగా రియాలిటీ షోలు, టీవీ షోలు, రేడియో జాకీగా పని చేసిన ఆయుష్మాన్‌ ‘విక్కీ డోనర్‌’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల విడుదలైన అతడి సినిమాలు ‘అంధాధూన్, బదాయి హో’  సినిమాలు మంచి వసూళ్లు సాధించాయి. ఇక... 2011లో తహీరాను పెళ్లి చేసుకున్న ఈ స్టార్‌కి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు.

That’s what you do when cancer shows up. You show it the way out! It is a tough phase to be in, but then I would have never known my own strength, which is inherent in each one of us, and which we come to know off when tested. Like I said before, let’s choose to be the heroes of our own drama of life. I strongly believe if an obstacle comes in your life it is for you to deal with it, overcome it, beat the shit out of it and become a better version of yourself, which could be a bit worn out but would be experienced, a bit tattered but more wise, a bit left out but more to bring forth, a bit handicapped but better equipped! So now the upgraded version of myself is dealing with cancer stage 1 a, which is still a result of early detection. I’ll be going through 12 sessions of chemotherapy. 6 down, and another 6 left. Hence the cap look nowadays😁 This post is dedicated to my journey where half the battle is won and the other half I want to fight with each of you who is enduring it. Be resilient, be strong, we shall overcome and how! Also I have immense gratitude for people around me who have taken it in the right spirit and didn’t give up on me. Personally I owe it to my best friend @komal20to77 husband @ayushmannk parents @kashyap6480 @yajankashyap . This bit is taken for granted but when professionally you are supported and still look dependable your resilience to fight becomes stronger. For this I owe it to @atulkasbekar @tanuj.garg @findingshanti @shrutiv11 who too were shocked when they heard the news but didn’t give up and still lay bet on this bruised but not broken horse. Gratitude 🙏 #earlydetection #breastcancerawareness #fuckcancer #spreadingawareness #selflovenomatterwhat #bruisedbutnotbroken #bodhisattva #sokavictor #spreadlove #compassion

A post shared by tahirakashyapkhurrana (@tahirakashyap) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement