సాక్షి, హైదరాబాద్: ఆ పేరు ఓ తల్లిది కావచ్చు.. ఓ చెల్లిది కావచ్చు.. ఓ భార్యదీ కావొచ్చు...రాష్ట్రంలో కేన్సర్ మహమ్మారి మహిళల పాలిట శాపంగా మారుతోంది. కేన్సర్ చికిత్స తీసుకునే వారిలో 90 శాతం మంది మహిళలే ఉంటున్నారు. ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్టు రాష్ట్రంలోని వందలాది ఆస్పత్రుల ద్వారా కేన్సర్‌కు చికిత్స అందిస్తోంది. కేన్సర్ చికిత్స పొందుతున్న వారికి సంబంధించి ఆరోగ్యశ్రీ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గణాంకాల ప్రకారం ఏటా సగటున 6 వేల మంది కేన్సర్ బారిన పడుతున్నారు. వీరిలో అధి క శాతం మహిళలే ఉంటు న్నారు. గర్భాశయ కేన్సర్ బాధితులు ఎక్కువ మంది ఉన్నారు. రొమ్ము కేన్సర్ బాధి తులు గణనీయంగా పెరుగుతున్నారు. గ్రామీణ ప్రాంతా ల్లోని మహిళలే ఎక్కువగా కేన్సర్ బారిన పడుతున్నారు. హైదరాబాద్‌లో రొమ్ము కేన్సర్ రోగులు ఎక్కువగా నమో దవుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గర్భాశయ కేన్సర్ రోగులు ఎక్కువగా ఉంటున్నారు. నోటి కేన్సర్ రోగులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికంగా నమోదవుతున్నారు.
అవగాహనా రాహిత్యమే కారణం..
అవగాహనా రాహిత్యమే కేన్సర్ తీవ్రతకు ప్రధాన కారణ మని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసిం ది. భారత్ సహా ఆగ్నేయాసియా దేశాల్లోనే ఏటా 14 లక్షల మంది కేన్సర్‌తో మరణిస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ పరం గా కేన్సర్ అవగాహనా కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్లే బాధితులు పెరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. కేన్సర్ రోగుల్లో 70% మంది 70 ఏళ్లలోపే మరణిస్తున్నారని తెలిపింది. పొగాకు, మద్యపానం వినియో గాన్ని పూర్తిస్థాయిలో అరికడితే పరిస్థితి మెరుగవుతుందని సూచించింది. సాధారణంగా కేన్సర్ తీవ్రస్థాయికి చేరుకు న్నాక కానీ భారత్‌లో రోగులు గుర్తించట్లేదని పేర్కొంది. దీంతో జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. చివరిదశలో ఉన్నప్పుడు ఆస్పత్రులకు వచ్చే వారిసంఖ్య ఎక్కువగా ఉంటోందని, ఫలితంగా చికిత్స పెద్దగా ప్రభావం చూప ట్లేదని ఆరోగ్యశ్రీ ట్రస్టు గణాంకాలు చెబుతున్నాయి.
గర్భాశయ కేన్సర్‌కు కారణాలు..
హ్యూమన్‌పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ). పౌష్టికాహార లోపం బాల్యవివాహాలు, 18 ఏళ్లలోపు కాన్పులు జరగడం. మర్మావయవాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, çసుఖవ్యాధుల తీవ్రత.
రొమ్ము కేన్సర్‌కు కారణాలు..
ఎక్కువసార్లు జన్యు పరంగా రొమ్ము కేన్సర్ వస్తోంది. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, 35 ఏళ్లు దాటాక గర్భధారణ, సంతానలేమి, పిల్లలకు తల్లి పాలు ఇవ్వకపోవడం కారణం.
రాష్ట్రంలో కేన్సర్ బాధితులు
గర్భాశయ 81,361
రొమ్ము 55,965
అండాశయం 11,257
జీర్ణకోశం 6,527
పెద్దపేగు 6,999
ఎముకలు 5,351
కండరాలు 4,898
అన్నవాహిక 5,062
ఊపిరితిత్తులు 3,445
రక్తం 4,018
Comments
Please login to add a commentAdd a comment